కర్ణాటక మోడీ రోడ్ షోలో భద్రతా వైఫల్యం వీడియో వైరల్..!!

కర్ణాటకలోని దావనగిరిలో ప్రధాని మోడీ( PM Modi ) ఎన్నికల ర్యాలీలో పాల్గొనడం జరిగింది.ఈ క్రమంలో రోడ్ షో ( Road Show ) కూడా నిర్వహించారు.

 Security Failure In Karnataka Modi Road Show Viral Video Details, Karnataka, Mod-TeluguStop.com

అయితే రోడ్ షో సందర్భంగా ప్రధాని కాన్వాయ్ వైపు ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ రావటం జరిగింది.దీంతో వెంటనే వేదిక వద్ద ఉన్న భద్రత బలగాలు సెక్యూరిటీ ( Security ) మొత్తం అలర్ట్ కావటంతో అతని అడ్డుకున్నారు.

దీంతో ప్రధాని మోడీ భద్రతా విషయంలో వైఫల్యం మరోసారి తేట తేళమైంది.దావనగిరి లోనే దాదాపు మూడు చోట్ల భద్రతా లోపం బయటపడింది.

అయితే ప్రధాని ర్యాలీలోకి దూసుకొచ్చిన యువకుడు బసవరాజుగా భద్రతా సిబ్బంది గుర్తించారు.

దీంతో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది.అంతేకాదు బహిరంగ సభ జరుగుతున్న సమయంలో కూడా ఓ వ్యక్తి హఠాత్తుగా డీ జోన్ లోకీ రావడం జరిగింది.కర్ణాటక రోడ్ షోలో భద్రత వైఫల్యం స్పష్టంగా కనబడటంతో బిజెపి శ్రేణులు ఆందోళన చెందారు.

మరోపక్క రోడ్ షోలో ప్రధాని మోడీ వైపు కుర్రోడు దూసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube