తెలంగాణ కాంగ్రెస్ లో అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ తీవ్ర కసరత్తు చేస్తోంది.ఈ మేరకు స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ తో నేతలు వరుసగా సమావేశం అవుతున్నారు.
ఓ వైపు గాంధీభవన్ కు ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీ సీనియర్ నేతలు తరలివస్తున్నారు.మరోవైపు వరుస సమావేశాల నేపథ్యంలో గాంధీభవన్ లో సందడి వాతావరణం నెలకొంది.
అదేవిధంగా కాంగ్రెస్ నేత మధుయాష్కీ నివాసంలో ప్రచార కమిటీ భేటీ అయింది.ఇందులో భాగంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన కీలక సమావేశం నిర్వహించారు.
ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార వ్యూహాంపై మంతనాలు జరుపుతున్నారని సమాచారం.