రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల వసూలు చేయాల్సిన ఫీజులపై తొలిసారి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.అడ్డగోలుగా చేస్తున్న దోపిడి కు చెక్ పెట్టే విధంగా అందరికీ అందుబాటులో ఉండేలా ఫీజులను నిర్ధారించింది.
ఫీజులకు సంబంధించి నిర్ణీత పరిమిత బారికేడ్లు లేకపోవడంతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు పలురకాల సౌకర్యాలు పేరుతో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ ఫీజులు ఫిక్సేషన్ పై ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
గతేడాది కూడా ఫీజులపై కమిషన్ కసరత్తు చేసినప్పటికీ కరోనా కారణంగా పూర్తి స్థాయి నివేదిక రూపొందించలేదు.అంతకుముందు ఏడాది వసూలు చేసిన రోజుల్లోనే 30 శాతం తగ్గించి వసూలు చేయాలని సిఫార్సు చేసింది.
ఈ విద్యా సంవత్సరంలో మాత్రం రాష్ట్రంలోని పేద వర్గాల నుంచి ధనికుల వరకు చెల్లించగలిగే స్థాయిలో వారున్నా ప్రాంతాల వారీగా కేటగిరీలుగా ఫీజులు తీసుకోవాలని సూచించింది.
కమిషన్ సూచనల మేరకు కొన్ని మార్పులతో తాజాగా మంగళవారం ప్రభుత్వం ఫీజులు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేసింది.
రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు జూనియర్ కళాశాలలో వసూలు చేసిన ఫీజులపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.రెండువేల 2021-2022, 2022-2023, 2023-2024 సంవత్సరాలను బ్లాక్ పిరియడ్ గా గుర్తించి ఆ మూడేళ్లుకు ఇవే ఫీజులు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.

పాఠశాలల్లో గ్రామ పంచాయతీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలకు నర్సరీ నుంచి 5వ తరగతి వరకు రూ.10,000 నుంచి 12,000.సెకండ్రీ 6 నుంచి 10 వరకు రూ.12,000.మున్సిపాలిటీ పరిధిలో ప్రైమరీకీ రూ.11000 సెకండరీ రూ.15,000.కార్పొరేషన్లో ప్రైమరీ రూ.12,000 సెకండరీ తరగతులకు రూ.18,000 సగటున వసూలు చేసుకోవచ్చు అని ప్రభుత్వం సూచించింది.

ఇంటర్ కు ఇలా గ్రామ పంచాయతీల్లో ఎంపీసీ, బైపీసీ లకు రూ.15,000 ఆర్ట్స్ గ్రూపులకు రూ.12,000మున్సిపాలిటీ పరిధిలో సైన్స్ గ్రూపులకు రూ.17,500 ఆర్ట్స్ గ్రూపు రూ.15,000మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోసైన్స్ గ్రూపులకు రూ.20,000 ఆర్ట్స్ గ్రూపులకు రూ.18,000 వసులు చేసుకోవచ్చని సూచించింది.