చెట్టును ఢీకొన్న స్కూల్ బస్సు.. షాకింగ్ వీడియో వైరల్..

పిల్లలను రోజూ ట్రాన్స్‌పోర్ట్ చేసే బస్సులను సరిగా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత స్కూల్ యాజమాన్యానికి ( School management )ఉంది.కానీ కొన్ని పాఠశాల యాజమాన్యాలు అన్నింటి పట్ల నిర్లక్ష్యం వహిస్తూ పిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుంటారు.

 School Bus Hit A Tree Shocking Video Viral , School Bus Accident, Wagholi Area-TeluguStop.com

పూణేలోని రైజింగ్‌స్టార్‌ స్కూల్ నిర్వాహకులు కూడా బస్సులు సరిగా మెయింటైన్ చేయలేదు.దాంతో సోమవారం నాడు బస్సు స్టీరింగ్ ఫెయిల్( Bus steering fail ) అయిపోయింది దాని ఫలితంగా భయంకర యాక్సిడెంట్ చోటు చేసుకుంది.

ఈ ఘటనలో పిల్లలుగాయపడ్డారువివరాల్లోకి వెళ్తే, సోమవారం డిసెంబర్ 4న మధ్యాహ్నం వేళ పూణెలోని వాఘోలి ప్రాంతంలో రైజింగ్‌స్టార్‌ స్కూల్‌కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది.ఆ బస్సులో ప్రమాదం జరిగినప్పుడు చాలామంది విద్యార్థులు ఉన్నారు.

స్టీరింగ్‌ ఫెయిల్‌( Steering fail ) కావడంతో బస్సును డ్రైవర్‌ కంట్రోల్ చేయలేకపోయాడు.దాంతో అది కంట్రోల్ రోడ్డు పక్కనే ఉన్న చెట్టును వేగంగా వచ్చి ఢీ కొట్టింది.

ఢీకొన్న ధాటికి బస్సు అద్దం పగిలింది.పక్కనే ఆగి ఉన్న బైక్ ధ్వంసమైంది.

బైక్ యజమాని అక్కడి నుంచి పారిపోవడంతో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ యాక్సిడెంట్ వీడియో సోషల్ మీడియాలో( Social media ) వైరల్ గా మారింది.బస్సులో ఉన్న పలువురు విద్యార్థులు, పాఠశాల సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయని లోకల్ మీడియా నివేదించింది.వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి అనంతరం డిశ్చార్జి చేశారు.

ప్రమాదం గురించి తెలుసుకున్న క్షతగాత్రుల తల్లిదండ్రులు, బంధువులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

స్కూల్ యాజమాన్యంపై( School management ) విద్యార్థుల తల్లిదండ్రులు లోనికండ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.బస్సు సరిగా మెయింటైన్ చేసే స్పృహ లేకుండా యజమానులు వ్యవహరిస్తున్నారని పేరెంట్స్ మండిపడ్డారు.బస్సుకు సరైన RTO పర్మిట్ లేదని వారు ఆరోపించారు.

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాఠశాల అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనపై లోనికండ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube