వ్యాయామాలు ఏ ఏ సమయాల్లో మానేయాలి?

ప్రతి ఒక్కరు తగ్గటానికి కఠినమైన వ్యాయామాలు చేస్తూ ఉంటారు.కొంత మంది జిమ్ లో చాలా ఎక్కువగా కష్టపడిపోతూ ఉంటారు.

శరీరాన్ని ప్రతి రోజు అంత కఠిన వ్యాయామాలతో శిక్షించకూడదు.నిపుణులు కూడా ఈ సమయాల్లో వ్యాయామాలు మానేయమని చెప్పుతున్నారు.

కాబట్టి ఇప్పుడు ఏ ఏ సమయాల్లో వ్యాయామాలు మానేయలో తెలుసుకుందాం.వ్యాయామం మానేసి శరీరానికి విశ్రాంతి ఎప్పుడు ఇవ్వాలో వివరంగా తెలుసుకుందాం.

ఆరోగ్యం సరిగా లేనప్పుడు జిమ్ కి వెళ్లి వ్యాయామాలు చేయకూడదు.ఆఖరికి చిన్నపాటి జలుబుగా ఉన్నాసరే వ్యాయామం మానేయటమే మంచిది.

Advertisement
Say No To Exercise Sometimes Aid-వ్యాయామాలు ఏ ఏ సమ�

జలుబు చేసినప్పుడు మీరు చేసే వ్యాయామాలు మీ రోగనిరోధక వ్యవస్థ మీద ప్రభావాన్ని చూపి జలుబు తొందరగా తగ్గకుండా చేస్తుంది.

Say No To Exercise Sometimes Aid

అలసట మరియు ఒత్తిడిగా ఉన్నప్పుడు కూడా వ్యాయామానికి దూరంగా ఉండాలి.ఒత్తిడి ఉన్నప్పుడు తేలికపాటి వ్యాయామం పర్వాలేదు.కానీ ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం వ్యాయామాల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది.

చిన్నపాటి గాయాలు అయినప్పుడు వ్యాయామానికి దూరంగా ఉండటమే బెటర్.ఎందుకంటే ఆ గాయాలు పెద్దవి అయితే మరింత బాధాకరంగా మారుతుంది.

రాత్రి సమయంలో ఎక్కువగా మద్యం సేవించి లేటుగా నిద్రపోయినప్పుడు మరుసటి రోజు కాస్త హేంగోవర్ ఉంటుంది.అందువల్ల ఆ సమయంలో వ్యాయామం చేయకుండా ఉంటేనే మంచిది.

దోమలు దూరంగా పారిపోవాలంటే ఈ మొక్కలను పెంచుకోండి
Advertisement

తాజా వార్తలు