మహానటి సావిత్రి వ్యసనాలతో గుప్త దానాలతో ఉన్నదంతా పోగొట్టుకొని కోమాలోకి వెళ్లి కన్నుమూసిన విషయం మనందరికీ తెలిసిందే.అయితే ఆమె డబ్బులు పోయాక ఇన్కమ్ టాక్స్ గొడవల వల్ల మద్యానికి బానిస అయ్యారని కొంతమంది చెప్తారు కానీ దాంట్లో నిజం లేదు.
ఎందుకంటే సావిత్రి ప్రతిరోజూ మూడు షిఫ్టుల్లో పనిచేసి ఎంతో ఉచ్చమైన స్థితిలో ఉన్నప్పుడే మద్యానికి అలవాటు పడ్డారు.పని ఒత్తిడి వల్ల ఎక్కువ టైం నటించాల్సిన రావడం వల్ల ఆవిడకు వెళ్ళినప్పుడు బాగా వచ్చేవట.
షూటింగ్ నుంచి అలసిపోయి వచ్చి రాత్రి అయ్యాక మంచం మీద వారి పోవడానికి ముందు కొన్ని పెగ్గులు తాగి పడుకోవడం వల్ల రిలాక్స్ అయ్యేవారు.అయితే అది తొలినాళ్ల వరకే పరిమితమైంది.
ఆ తర్వాత రోజుల్లో అదే మద్యానికి ఆమె శరీరం బానిసగా మారడం మొదలుపెట్టింది.ఒక్కొక్కటిగా అన్ని వెళ్ళిపోతున్న ఆమె మరింత మద్యానికి అలవాటు పడ్డారు భర్త పోయి డబ్బులు పోయి పిల్లలు కూడా దూరం అవుతున్న సమయంలో ఆమె మరింత వ్యసనాలకు బానిస అయ్యారు.అయితే ఆమెను ఆ అలవాట్ల నుంచి పక్కకు తప్పించాల్సిన బాధ్యత తీసుకున్న వ్యక్తులు ఎవరూ లేరు.పైన అక్కినేని వంటి హీరోలు ఆమెతో కలిసి కూర్చొని మందు తాగుతూ తెల్లవార్లు కబుర్లు చెప్పుకోవడం అలవాటయింది.
ఇక అమలాపురంలో షూటింగ్ ఉందంటే చాలు అక్కడ అద్దెకు తీసుకునే ఇంటి ఓనర్లతో కూర్చుని సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు రోజుల గంటల తరబడి తాగుతూ ఉండేవారట.
అలా ఆమెను మరింత దిగజారిపోయేలా చేయడంలో స్టార్ హీరోల బాధ్యత కూడా కొంత ఉందనే చెప్పవచ్చు.హీరోయిన్స్ తో కూర్చొని మందు తాగితే వారి స్టేటస్ పెరిగిపోతుంది అని అనుకునే రోజుల్లో ఉన్నారు కాబట్టి అప్పుడు అందరూ ఆమెను అలా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు.జమునను కూడా అక్కినేని మందు తీసుకోమని ఒకానొక టైం లో బలవంతం చేశారని కానీ ఆమె అందుకు నిరాకరించడంతో జమున మద్యానికి అలవాటు కాలేదని చనిపోవడానికి ముందు కొన్ని ఇంటర్వ్యూలో తెలిపారు.
అలా చాలామంది హీరోయిన్స్ కూడా మద్యానికి అలవాటు పడ్డారు కొంతమంది బయటపడి బ్రతికి బట్ట కట్టారు కానీ సావిత్రి లాగా కొంతమంది ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.