విశాఖపట్నం ఆషాడ శుద్ధ ఏకాదశి(తొలి ఏకాదశి)పర్వదినం సందర్భంగా కొత్త గాజువాక రాజీవ్ మార్గ్ లోని శ్రీ సత్తెమ్మతల్లి అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరించారు.వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
తొలి పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి,65 వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు పాల్గొని పూజలు చేశారు.ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ అమ్మవారి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు.
గత రెండేళ్లు కరోనా కారణంగా ఎటువంటి వేడుకలు నిర్వహించుకోలేకపోయామని ఇప్పుడిప్పుడే వాతావరణం అనుకూలించడంతో ఆలయాల్లో ఉత్సవాలు జరుపుతున్నారని చెప్పారు.అమ్మవారిని దర్శించుకుంటే సకల కోర్కెలు నెరవేరుతాయని చెప్పారు.
కార్యక్రమంలో మద్దాల అప్పారావు,విళ్లూరి శ్రీనివాసరావు,వార్డు అధ్యక్షుడు లోకనాధం,నాగిశెట్టి శ్రీనివాస్,ఇరోతి గణేశ్, మంగునాయుడు,ఓలేటి నూకరాజు,ఆలయ కమిటీ సభ్యులు ఎస్ శివ,హరినాధ్,సింహాచలం నాయుడు,మళ్ళ నరసింగరావు,ఆదినారాయణ,సత్తిబాబు,కుమార్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు
.