సర్కారు కూడా పెంచేసింది.. టికెట్ రేట్ పై కొత్త జీవో..

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో మోస్ట్ అందగాడు ఎవరు అంటే వినిపించే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు.ఈయన ఫాలోయిన్ నే వేరు.

 Sarkaru Vaari Paata Ap Hikes, Sarkaru Vaari Paata, Mahesh Babu, Keerthy Suresh,-TeluguStop.com

సౌత్ హీరోల్లో మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు అంటే నమ్మాల్సిందే.ఇక ఇప్పుడు ఈయన నటించిన సర్కారు వారి పాట సినిమాతో మహేష్ బాబు రాబోతున్నాడు.

మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ సినిమా గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తుంది.ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా సర్కారు వారి పాట.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు మేకర్స్.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నుండి ఇటీవలే ఊర మాస్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యి భారీ రెస్పాన్స్ అందుకుంటుంది.

ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేసింది.అలాగే నిన్న మాస్ సాంగ్ ను కూడా రిలీజ్ చేసారు.

మ.మ.మహేశా.అంటూ సాగే ఈ పాటలో మహేష్ బాబు, కీర్తి సురేష్ ఊర మాస్ స్టెప్పులు వేసి అలరించారు.

దీంతో ఈ సాంగ్ థియేటర్స్ లో సౌండ్ బాక్సులు బద్దలవ్వడం ఖాయం అంటున్నారు.

Telugu Ap Tickets, Keerthy Suresh, Mahesh Babu, Gos, Parushuram, Sarkaruvaari-Mo

ఇక తాజాగా ఈ సినిమా మరొక ఐదు రోజుల్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సినిమాకు స్వల్పంగా ధరలు పెంచుకునే వెసులుబాటు కలిపించారు.ఈ మేరకు కొత్త జీవోలు కూడా రిలీజ్ చేసారు.ఏపీ ప్రభుత్వం ఈ సినిమాకి సూపర్ హై బడ్జెట్ క్యాటగిరీలో 10 రోజుల పాటు 45 రూపాయలను అదనంగా పెంచుకునే విధంగా వెసులుబాటు కలిపించారు.

దీనిపై జీవో కూడా రిలీజ్ చెయ్యగా ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది.ఈ సినిమా టికెట్ రేట్ పెరగడంతో భారీ ఓపెనింగ్స్ ఖాయం అంటున్నారు క్రిటిక్స్.మరి చూడాలి ఓపెనింగ్స్ తోనే ఈ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube