పాత కారులో 6 రోజుల పాటు బ్రతికిన శృతి హాసన్ తల్లి

సారిక.కమల్ హాసన్ మాజీ భార్య.శ్రుతి హాసన్ కన్నతల్లి.

సినిమా నటిగా గుర్తింపు తెచ్చుకున్నా.తన జీవితం అంతా ముళ్ల బాటగానే చెప్పుకోవచ్చు.

తన చిన్న వయసులోనే తల్లిదండ్రులు విడిపోయారు.నాలుగేళ్ల వయసులోనే పనికోసం మొదలు పెట్టింది.

స్కూలుకు వెళ్లడం మానేసి.సినిమా స్టూడియోల చుట్టూ తిరిగింది.21 సంవత్సరాల వయసులో కట్టుబట్టలతో తల్లి ఇంటి నుంచి బయట అడుగు పెట్టింది.ఆ తర్వాత ఏం చెయ్యలో తెలియక.

Advertisement
Sarika Untold Struggles In Her Early Days, Sarika, Shruthi Haasan Mother, Akshar

పాత కారులో ఆరు రోజుల పాటు ఉంది.బయట ఏదో ఒకటి తిని.ఆ కారులోనే తల దాచుకుంది.28 ఏండ్లకు కమల్ హాసన్ ను వివాహం చేసుకుంది.43 ఏండ్ల వయసు వచ్చే సరితి తన భర్తతో విడిపోయింది.తన ఇద్దరు బిడ్డలైన శ్రుతి, అక్ష‌ర‌ను తీసుకుని ముంబైకి వెళ్లిపోయింది.

నిజానికి సారిక తన నాలుగేళ్ల వయసులో 1967లో దర్శకుడు బిఆర్ చోప్రా తెరకెక్కించిన హమ్ రాజ్ సినిమాలో నటించింది.తనకున్న ఆర్థిక సమస్యల కారణంగా స్కూలుకు వెళ్లకుండా సినిమాల్లోనే నటించింది.

కమల్ తో పెళ్లయ్యాక.తన నటనా జీవితానికి స్వస్తి పలికింది.

ఆ తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్ గా మారింది.క‌మ‌ల్ హాసన్ నటించిన హే రామ్ మూవీకి గాను బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా జాతీయ అవార్డును అందుకుంది.

Sarika Untold Struggles In Her Early Days, Sarika, Shruthi Haasan Mother, Akshar
రిలీజ్ డేట్ చెప్పిన.. విడుదలకు నోచుకోని సినిమాలు.. లిస్ట్ ఇదే?

తన జీవితంలో చెన్నై నుంచి ముంబైకి వెళ్లడం చాలా కష్టమైన పని అయినా వెళ్లింది.ఇద్దరు కూతుర్లతో అక్కడికి వెళ్లి చాలా ఇబ్బంది పడింది.తన కూతుర్లు ఇద్దరు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక కాస్త కుదుట పడింది.

Advertisement

ముంబైకి వెళ్లిన తొలినాళ్లలో తను మళ్లీ నటిగా మారింది.డబ్బుకోసం,తన పిల్లలను పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది.

ముంబైకి వెళ్లిన కొత్తలో తన దగ్గర బ్యాంక్ అకౌంట్ కూడా లేదు.కానీ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ప‌ర్జానియా సినిమాలో నటనకు ఉత్తమ జాతీయ నటిగా అవార్డును అందుకుంది.అందరి చేత శభాష్ అనిపించుకుంది.

తాజా వార్తలు