Bhagavanth Kesari: భారీ రేటుకు భగవంత్ కేసరి రైట్స్.. బాలయ్య బాబు క్రేజ్ మాములుగా లేదుగా?

హీరో నందమూరి బాలకృష్ణ( Balakrishna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం బాలయ్య బాబు వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Sarigama Cinemas Will Release Balakrishna Bhagavanth Kesari In Overseas-TeluguStop.com

ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు.కాగా బాలయ్య బాబు నటించిన సినిమాలు అన్నీ కూడా వరుసగా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుండడంతో బాలయ్య బాబు అదే ఊపుతో మరిన్ని సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.

ఈ క్రమంలోనే బాలయ్య బాబు తాజాగా నటించిన చిత్రం భగవంత్ కేసరి.

ఈ మూవీ దసరా పండుగకు కానుకగా విడుదల కానుంది.కాగా ఈ ఏడాది ఆరంభంలో బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీర సింహారెడ్డి సినిమాలో నటించిన విషయం తెలిసిందే.అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఇక ఈ సినిమా తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో భగవంత్ కేసరి ( Bhagavanth Kesari )అనే సినిమాను చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.

అలాగే శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటిస్తోందట.ఈ మూవీ అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.ఇది ఇలా ఉంటే తాజాగా సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియా( Social media )లో చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే.ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను ఫాన్సీ రేటుకు సరిగమ సినిమాస్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.భారీ రేటుకు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసేందుకు హక్కులు సాధించుకున్నట్లు సమాచారం.మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకోవడంతో పాటు ఒక వీడియో రిలీజ్ చేశారు.

ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.భగవంత్ కేసరి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ఆ వీడియో చూస్తే అర్థం అవుతోంది.

https://youtu.be/kQKtsmGZkCA
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube