దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దివంగత నటుడు శరత్ బాబు ( Sarath Babu )మే 22వ తేదీ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన విషయం మనకు తెలిసింది.ఇలా శరత్ బాబు మరణించడంతో తాజాగా పరుచూరి గోపాలకృష్ణ ( Parachuri Gopala Krishna ) తన పరుచూరి పలుకుల ద్వారా శరత్ బాబు గురించి మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.
ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ శరత్ బాబు గారితో తనకున్నటువంటి అనుబంధం గురించి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.
ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ శరత్ బాబు గురించి మాట్లాడుతూ… ఇండస్ట్రీలో ఉండే గొప్ప నటులందరూ వెళ్లిపోతూ ఉంటే చాలా బాధగా ఉందని ఆయన తెలియజేశారు.శరత్ బాబుతో తనకు ఎంతో మంచి అనుబంధం ఉంది ఆయన మా ఇంటి పక్కనే ఉండేవారు.ప్రతిరోజు వాకింగ్ వెళ్లిన సమయంలో తనని చూసేవాడిని తెలిపారు.
అయితే ఆయనని ఎప్పుడు చూసినా చిరునవ్వుతోనే కనిపించే వారని పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు.ఎన్నోసార్లు నేను శరత్ బాబు గారితో మాట్లాడుతూ మీకు నవ్వు దేవుడిచ్చిన వరం అని తనతో చెప్పానని పరుచూరి వెల్లడించారు.
ఇక సినిమాల పరంగా శరత్ బాబు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు.ఒక నటుడు ఐదు భాషలలో సినిమాలు చేయాలి అంటే సామాన్యమైన విషయం కాదు కానీ శరత్ బాబు నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఇక శరత్ బాబు అనారోగ్య సమస్యల( Health Issues )తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు అనే విషయం తెలియగానే ఆయన క్షేమంగా తిరిగి కోలుకోవాలని ప్రార్థించిన వారిలో తాను కూడా ఒకరిని పరుచూరి గోపాలకృష్ణ ఈ సందర్భంగా తెలియజేశారు.ఇక శరత్ బాబు వ్యక్తిగత జీవితం( Personal Life ) గురించి అందరికీ తెలిసిందే.కొందరి మనస్తత్వాలు చాలా భిన్నంగా ఉంటాయని వారు తట్టుకోలేనటువంటి సమస్యలు వస్తే సన్యాసం తీసుకుంటారని తెలిపారు.కానీ శరత్ బాబు అలా చేయకుండా ఒంటరితనంలోకి వెళ్లారు.ఆయన ఎప్పుడు ఒంటరితనాన్ని మౌనాన్ని ప్రేమించారని, ఆ మౌనంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు కానీ బయటకు పెట్టని ఒక గొప్ప వ్యక్తి శరత్ బాబు అంటూ ఈ సందర్భంగా ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పరుచూరి ఎమోషనల్ అయ్యారు.