టాలీవుడ్ ( Tollywood )ఇండస్ట్రీలో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఐదు సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.ఒకటి లేదా రెండు సినిమాలు సంక్రాంతి రేసు నుంచి తప్పుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే అధికారికంగా క్లారిటీ వస్తే మాత్రమే ఈ వార్తల్లో నిజానిజాలు తెలిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.సంక్రాంతి సినిమాలకు 250 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగింది.
కలెక్షన్లు భారీ స్థాయిలో వస్తే మాత్రమే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.అయితే సంక్రాంతి పండుగకు రిలీజ్ కానున్న సినిమాలతో చాలామంది హీరోయిన్లు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
గుంటూరు కారం( Guntur karam ) సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి( Srileela , Meenakshi Chaudhary ) నటించగా ఈ ఇద్దరు హీరోయిన్లకు భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవసరం అనే సంగతి తెలిసిందే.ఈ ఇద్దరు హీరోయిన్లు ఈ సినిమా కచ్చితంగా తమకు కావాల్సిన హిట్ అందిస్తుందని నమ్ముతున్నారు.

ఈగల్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్( Anupama Parameswaran, Kavya Thapar ) నటిస్తుండగా ఈ ఇద్దరు హీరోయిన్లు కూడా ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు.నా సామిరంగ సినిమాలో అషికా రంగనాథ్( Ashika Ranganath ) హీరోయిన్ గా నటించినా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే ఆమెకు ఆఫర్లు వస్తాయని చెప్పవచ్చు.సైంధవ్ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్( Shraddha Srinath ), హనుమాన్ సినిమాలో అమృతా అయ్యర్( Amrita Iyer ) నటించగా ఈ హీరోయిన్లకు కూడా తమ సినిమాలు సక్సెస్ సాధించడం కీలకమని చెప్పవచ్చు.

సంక్రాంతి హీరోయిన్లలో చాలామంది హీరోయిన్లు ఫ్లాప్ హీరోయిన్లు కాగా ఆయా సినిమాలలో ఈ హీరోయిన్లకు ఏ స్థాయిలో ప్రాధాన్యత దక్కుతుందో చూడాలి.సంక్రాంతి సినిమాలతో థియేటర్లు కళకళలాడటం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సంక్రాంతి సినిమాలు బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తాయో చుడాలి.
సంక్రాంతి సినిమాలపై అంచనాలు ఊహించని స్థాయిలో పెరిగాయి.








