సంక్రాంతి సీజన్ వెంకీకి వెరీ వెరీ స్పెషల్

తెలుగు సినిమా పరిశ్రమలో దగ్గుబాటి వెంకటేష్ కు ఓ ప్రత్యేకత ఉంది.మూవీ మొఘల్ రామానాయుడు కొడుకుగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆయన.

స్వశక్తితో ఎదిగాడు.అద్భుత నటనతో ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు.

ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.విక్టరీ వెంకటేష్ గా పేరు తెచ్చుకున్నాడు.

అంతేకాదు.ఆయన నటనకు గాను ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు.తెలుగు సినిమా పరిశ్రమలో ఉత్తమ నటుడిగా ఎక్కువ నంది అవార్డులు అందుకున్న హీరోగా నిలిచాడు వెంకటేష్.1986లో వచ్చిన క‌లియుగ పాండ‌వులు, 1898లో వచ్చిన స్వ‌ర్ణ‌క‌మ‌లం, 1989లో వచ్చిన ప్రేమ, 1996లో వచ్చిన ధ‌ర్మ చ‌క్రం, 1998లో వచ్చిన గ‌ణేశ్, 2000లో వచ్చిన క‌లిసుందాం.రా!, 2007లో వచ్చిన ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే సినిమాలకు గాను ఏడు సార్లు నంది అవార్డులను దక్కించుకున్నాడు.

Advertisement
Sankranthi Festival Very Sepcial To Venkatesh , Victory Venkatesh, Movie Mogul

వాస్తవానికి ఉత్తమ నటుడి విభాగంలో కలియుగ పాండవులు చిత్రంలో నటనకు గాను.స్పెషల్ జ్యూరీని అందుకున్నాడు వెంకటేష్.ఆ తర్వాత స్వర్ణకమలం సినిమాకు గాను మరో స్పెషల్ జ్యూరీని అందుకున్నాడు.

మిగిలిన ఐదు సినిమాల్లో నటనకు గాను ఉత్తమ నటుడిగా నందిలను దక్కించుకున్నాడు.అయితే వెంకటేష్ కు నందిని అందించిన చిత్రాల్లో మూడు సినిమాలు సంక్రాంతి సీజన్ లోనే విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి.

ఆ సినిమాలే ప్రేమ, ధర్మచక్రం, కలిసుందాం రా.ఈ మూడు సినిమాలు కూడా తమ సొంత నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించినవే.ఇప్పటికీ సంక్రాంతి బరిలో నిలిచిన మూడు నందిలు అందుకున్న ఏకైక హీరోగా వెంకటేష్ ఘనత వహించాడు.

Sankranthi Festival Very Sepcial To Venkatesh , Victory Venkatesh, Movie Mogul

మొత్తంగా విక్టరీ వెంకటేష్ కు సంక్రాంతి సీజన్ కలిసి వచ్చింది.ఈ సీజన్ లో ఆయన సినిమాలు బ్లాక్ బస్టర్ కావడమే కాదు.మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చాయి.

న్యూస్ రౌండప్ టాప్ 20

నంది సహా పలు రకాల అవార్డులను అందించాయి.రికార్డుల పరంగానే కాదు.

Advertisement

అవార్డుల పరంగానూ వెంకటేష్ కు సంక్రాంతి బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు.

తాజా వార్తలు