మంజ్రేకర్‌ కు షాక్ ఇచ్చిన బీసీసీఐ!

బీసీసీఐ ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపిఎల్ ఈసారి కరోనా కారణంగా యూఏఈ వేదికగా జరగనున్నది.

బీసీసీఐ ఈ మెగా టోర్నీకి కరోనా బెడద ఉండకూడదని బోలెడన్ని జాగ్రత్తలు తీసుకుంది కానీ అవి చెన్నై సూపర్ కింగ్స్ టీం కరోనా కోరలలో చిక్కకుండా కాపడలేకపోయాయి.

దీనితో బీసీసీఐ మరిన్ని కఠిన నిర్ణయాలను తీసుకుంటుందని సమాచారం ప్రస్తుతానికి కరోనా కోరల నుండి చెన్నై సూపర్ కింగ్స్ బయటపడి ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు సమాచారం.ఇక రోజుల వ్యవధిలో ఐపీఎల్ మొదలవ్వతుండడంతో బీసీసీఐ తాజాగా ఐపీఎల్ కోసం ఏడుగురు సభ్యులతో కూడిన కామెంటరీ ప్యానల్‌ను ఏర్పాటు చేసింది.

Sanjay Manjrekar Shocked With BCCI Decision, Sanjay Manjrekar , BCCI, Commentary

ఈ ప్యానల్ లో సునీల్‌ గవాస్కర్, ఎల్‌.శివరామకృష్ణన్, మురళీ కార్తీక్, దీప్‌ దాస్‌గుప్తా, రోహన్‌ గవాస్కర్, హర్ష భోగ్లే, అంజుమ్‌ చోప్రా వంటి పలువురికి అవకాశాలు ఇచ్చి సంజయ్‌ మంజ్రేకర్‌ ను పక్కన పెట్టింది.

దీనికి కారణమేంటో తెలియాల్సివుంది.ప్రముఖ క్రికెట్‌ వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ తన శైలితో గతంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు.

Advertisement

అవి దృష్టిలో ఉంచుకుని బిసిసిఐ ఇలాంటి నిర్ణయం తీసుకుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి
Advertisement

తాజా వార్తలు