అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాల తర్వాత సందీప్ వంగ చేస్తున్న మూవీ యానిమల్.ఈ సినిమాని హిందీలో తీస్తున్నా సరే పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
రణ్ బీర్ కపూర్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి కొన్ని ఫోటోలు లీక్ అవగా వాటిని చూస్తుంటే మళ్లీ సందీప్ వంగా ఈ యానిమల్ సినిమాతో మరో అద్భుతాన్ని సృష్టించేలా ఉన్నాడని అర్ధమవుతుంది.
అర్జున్ రెడ్డి సినిమాతోనే తన టాలెంట్ ఏంటో చూపించిన ఈ డైరక్టర్ ఇప్పుడు యానిమల్ తో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.యానిమల్ మూవీలో రణ్ బీర్ కపూర్ ని చాలా డిఫరెంట్ గా చూపించబోతున్నారని అర్ధమవుతుంది.
రణ్ బీర్ కపూర్ యానిమల్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ మూవీ హిట్టు కొడితే మాత్రం సందీప్ వంగ కూడా పాన్ ఇండియా డైరక్టర్స్ లిస్ట్ లో చేరినట్టే అని చెప్పొచ్చు.
రష్మికకు బాలీవుడ్ లో మొదటి బిగ్ మూవీ అని చెప్పొచ్చు.ఇప్పటికే అమ్మడు అక్కడ రెండు సినిమాల్లో నటించింది.







