హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సందీప్ శాండిల్య నియామకం అయ్యారు.ఈ మేరకు నగర సీపీగా సందీప్ శాండిల్యను నియమిస్తూ తెలంగాణ సీఎస్ శాంత కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం సందీప్ శాండిల్య పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.గతంలో రైల్వే అడిషనల్ డీజీగానూ, సైబరాబాద్ సీపీగా సందీప్ శాండిల్య పని చేసిన విషయం తెలిసిందే.
అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి గెజిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.