అమ్మాయిల విషయం లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తీరు నాకు నచ్చదు అంటూ సందీప్ వంగ షాకింగ్ కామెంట్స్!

కేవలం ఒకే ఒక్క సినిమాతో యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్న దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది సందీప్ రెడ్డి వంగ( Sandeep reddy Vanga ) మాత్రమే.

ఆయన దర్శకత్వం లో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ని స్టార్ లీగ్ లోకి తీసుకెళ్లాడు.ఇదే సినిమాని హిందీ లో కబీర్ సింగ్ పేరు తో రీమేక్ చేసి బాలీవుడ్ ని షేక్ చేసాడు.

ఈ సినిమా తర్వాత ఆయన రణబీర్ కపూర్ తో ఎనిమల్( Animal Trailer ) అనే చిత్రం చేసాడు.ఈ సినిమా డిసెంబర్ 1 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలలో ఘనంగా విడుదల కాబోతుంది.

ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రీసెంట్ గానే విడుదల చెయ్యగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Sandeep Reddy Vangas Shocking Comments Saying That I Dont Like Trivikram Srini
Advertisement
Sandeep Reddy Vanga's Shocking Comments Saying That I Don't Like Trivikram Srini

అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా రణబీర్ కపూర్ , సందీప్ వంగ మరియు రష్మిక తెలుగు మరియు హిందీ భాషల్లో ఇంటర్వ్యూస్ మరియు ఎంటర్టైన్మెంట్ షోస్ లోకి వచ్చి తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు.అందులో భాగంగా ఆహా మీడియా లో స్ట్రీమింగ్ అవుతున్న నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ విత్ NBK( Unstoppable with NBK ) లిమిటెడ్ ఎడిషన్ సీజన్ కి విచ్చేసారు.ఈ సీజన్ లో ఈ ముగ్గురు బాలయ్య తో చెప్పుకున్న ముచ్చట్లు, చేసిన సరదా ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

షో మధ్యలో విజయ్ దేవరకొండ కి కూడా ఫోన్ చేసి కాసేపు సరదాగా మాట్లాడుతారు.ఈ ఫోన్ కాల్ సంభాషణ ని చూస్తూ ఉంటే రష్మిక మరియు విజయ్ ప్రేమ వ్యవహారం బయటపడుద్ది.

అలాగే ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో బాలయ్య అడిగిన కొన్ని ప్రశ్నలకు సందీప్ వంగ చాలా నిజాయితీ తో సమాధానం చెప్తాడు.

Sandeep Reddy Vangas Shocking Comments Saying That I Dont Like Trivikram Srini

ఇండియా లో ప్రస్తుతం టాప్ లీడింగ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ పేర్లు చెప్తూ త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) లో నీకు నచ్చింది, నచ్చనిది ఏంటో చెప్పమని అంటాడు.అప్పుడు సందీప్ ఆయన లాగ గొప్పగా డైలాగ్స్ రాసే దర్శకుడు ఇండియాలోనే లేరు అనేది నా ఫీలింగ్ అని అంటాడు.అప్పుడు త్రివిక్రమ్ లో నచ్చని అంశాలు ఏమిటి అని అడిగితే ప్రతీ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టుకుంటాడు, అమ్మాయిల క్యారెక్టర్స్ ని చాలా తక్కువ చేసి రాస్తాడు,అదే నాకు నచ్చదు అని అంటాడు సందీప్.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

అలాగే సుకుమార్ సినిమాల్లో హీరోల క్యారెక్టర్స్ బాగా ఇష్టమనీ, కానీ ఆయన ఒక సినిమా తియ్యడానికి అంత సమయం తీసుకోవడం నచ్చదు అని అంటాడు.పూరి జగన్నాథ్ గురించి మాట్లాడుతూ ఆయన పోకిరి సినిమా స్క్రిప్ట్ ని కేవలం 9 రోజుల్లో రాసాడట.

Advertisement

అందుకే ఆయన సినిమాలు నడవడం లేదని అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.

తాజా వార్తలు