యానిమల్ సినిమా( Animal Movie ) ద్వారా మరో సెన్సేషనల్ సక్సెస్ అందుకున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి ( Sandeep Reddy ) వంగ.ఈయన దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది.
ఇక అమెరికాలో డల్లాస్ లో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో ఆదరణ పొంది మంచి కలెక్షన్లను రాబడుతుంది ఇలా ప్రతి ఒక్క చోట అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడంతో సందీప్ రెడ్డి గ్రాఫ్ మరింత పెరిగిపోయిందని చెప్పాలి.ఈ సినిమా మంచి సక్సెస్ కావటంతో ఈయన డల్లాస్ లోని తెలుగు వారితో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు.

ఈ సందర్భంగా వారు అడిగే ప్రశ్నలకు ఈయన సమాధానాలు చెబుతూ వచ్చారు.ఈ క్రమంలోనే మీరు చిరంజీవితో( Chiranjeevi ) సినిమా చేస్తారా అనే ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు సందీప్ రెడ్డి సమాధానం చెబుతూ తాను చిరంజీవితో సినిమా చేయడానికి సిద్ధంగానే ఉన్నానని తెలిపారు ఆయనతో యాక్షన్ మూవీ చేయాలి అంటూ జానర్ కూడా తెలియజేశారు.ఎప్పటినుంచో చిరంజీవితో సినిమా చేయడం కోసమే తాను ఎదురు చూస్తున్నాను అంటూ ఈ సందర్భంగా తన మనసులో ఉన్నటువంటి మాటను సందీప్ రెడ్డి బయటపెట్టారు.
మరి ఈయన కోరికను చిరంజీవి తీరుస్తారా ఈయనకు అవకాశం ఇస్తారా అన్నది అందరికీ ప్రశ్నార్థకంగా మారింది.

సందీప్ రెడ్డి ఇండస్ట్రీలోకి రాక ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ చిరంజీవి( Pawan Kalyan,Chiranjeevi ) అంటే ఎంతో అభిమానించి వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని తాను ఇండస్ట్రీలోకి వచ్చానని పలు సందర్భాలలో తెలియజేశారు.ఇలా వారి అభిమానిగా చిరంజీవితో సినిమా చేయటం కోసం ఈయన ఎదురు చూస్తున్నారని పలు సందర్భాలలో తెలియజేశారు.కానీ చిరంజీవి మాత్రం ఇలాంటి టాలెంట్ డైరెక్టర్లకు అవకాశాలు ఇవ్వకుండా మెహర్ రమేష్, బాబీ డైరెక్టర్ల వద్దనే ఆగిపోయారు అంటూ అభిమానులు ఈ విషయంపై వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక సందీప్ రెడ్డి కామెంట్ చూస్తే ఎప్పటికైనా వీరి కాంబినేషన్లో సినిమా రావడం పక్కా అని స్పష్టంగా అర్థం అవుతుంది.