బిగ్ బాస్( Bigg Boss )సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రస్తుతం ఉల్టా పుల్టా కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సీజన్ ఇప్పటికే 13 వ వారం కొనసాగుతుంది.
ఈ 13వ వారంలో భాగంగా టికెట్ టు ఫైనాలే రౌండ్ జరుగుతుంది.ఇందులో భాగంగా కంటెస్టెంట్లు కూడా పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారని చెప్పాలి.
ఇదిలా ఉండగా ఈ సీజన్ ఉల్టా పుల్టా కావడంతో మనం ఊహించిన దానికి చాలా విరుద్ధంగా ఈ సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సీజన్ టైటిల్ రేస్ లో పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) శివాజీ ఉన్న సంగతి మనకు తెలిసిందే.
అయితే ఇప్పుడు మాత్రం శివాజీ కాస్త డల్ కావడంతో ఆ రేసులోకి అమర్ దీప్ కూడా వచ్చారని తెలుస్తుంది.

అమర్ కూడ తన ఆట తీరును మెరుగుపరుస్తూ ఏకంగా టైటిల్ రేసులో నిలబడ్డారు.ఇక గత వారం కెప్టెన్సీ టాస్కులో భాగంగా అమర్ దీప్ ( Amar Deep ) పట్ల శివాజీ వ్యవహరించిన తీరు కారణంగా ఆయనకు పూర్తి నెగిటివిటీ రాగా అమర్ పై సింపతి కూడా పెరిగింది.దీంతో ఈయనకు భారీ స్థాయిలో ఫాలోయింగ్ రావడమే కాకుండా ఏకంగా టైటిల్ రేస్ లో కూడా నిలబడ్డారు.
అయితే బిగ్ బాస్ కార్యక్రమం గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.ఈసారి ట్రోఫీ ఒకరికి ప్రైజ్ మనీ మరొకరికి ఇవ్వబోతున్నారు అంటూ తాజాగా సందీప్ మాస్టర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సందీప్ మాస్టర్ ఈ విషయం గురించి మాట్లాడుతూ శివాజీ ( Shivaji ) మైండ్ గేమ్ చాలా ఆడుతున్నారని తప్పకుండా ఆయన టైటిల్ గెలుస్తారని తెలిపారు.అయితే ఈసారి మాత్రం టైటిల్ ఒకరికి అలాగే ప్రైజ్ మనీ మరొకరికి ఇవ్వబోతున్నారు అంటూ ఈయన మాట్లాడారు.అయితే ఈ విషయం మీకు ఎలా తెలుసు అంటూ ప్రశ్నించగా నాకు అన్ని అలా తెలుస్తాయంటూ చెప్పుకొచ్చారు.ఇది సందీప్( Sandeep ) అంచనా మాత్రమే ఫైనల్ లో ఏమవుతుంది అనేది చూడాలి.







