కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ( Dhanush )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ధనుష్ కి కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
కన్నడలో ధనుష్ నటించిన సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచాయి.ఇది ఇలా ఉంటే ధనుష్ ఇటీవలే తెలుగులో నేరుగా సార్ సినిమాతో( Sir movie ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ అని అందుకుంది.కాగా ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
ఇటీవల కాలంలో వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు ధనుష్.ప్రస్తుతం తదుపరి సినిమా షూటింగ్ లో భాగంగా బిజీబిజీగా గడుపుతున్నారు.కాగా ధనుష్ తన 50వ సినిమాకు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు.ప్రస్తుతానికి D50 అని పేరు పెట్టారు.ఈ సినిమాలో విష్ణు విశాల్( Vishnu Vishal ) హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది.అలాగే ఇందులో హీరో ధనుష్ సోదరుడి పాత్రలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్( Sandeep Kishan ) ను ఎంపిక చేసినట్లు కూడా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
అలాగే ఈ సినిమాలో విలక్షణ నటుడు ఎస్‌జే సూర్య కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇక హీరో సందీప్ కిషన్ ఇప్పటికే ధనుష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ కెప్టెన్ మిల్లర్ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.గ్యాంగ్ స్టర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈమూవీలో కాళిదాస్, దుషార విజయ్ కీలకపాత్రలలో కనిపించనున్నారు.