వారం రోజుల్లో 2 డబుల్ సెంచరీలు.. టీమిండియా సెలక్షన్ కమిటీకి సంకేతాలు ఇస్తున్నాడుగా?

భారత దేశవాళీ క్రికెట్‌లో ఓ యువ క్రికెటర్ తన అద్భుతమైన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.అతనే సమీర్ రిజ్వీ.

( Sameer Rizvi ) వారం రోజుల్లోనే రెండోసారి డబుల్ సెంచరీ సాధించి ఈ యువ బ్యాట్స్‌మన్ పెద్ద ఘనతను సాధించాడు.ప్రస్తుతం అండర్-23 స్టేట్ A ట్రోఫీలో( Under-23 State-A Trophy ) ఆడుతున్న సమీర్ రిజ్వీ తన ఆడుకుతో క్రీడాభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు.

తాజాగా విదర్భ జట్టుపై సమీర్ రిజ్వీ 105 బంతుల్లోనే అజేయంగా 202 పరుగులు చేసి తన ప్రతిభను చాటుకున్నాడు.ఈ ఇన్నింగ్స్‌లో అతడు 10 ఫోర్లు, 18 సిక్సర్లతో విరుచుకుపడిన రిజ్వీ 192.38 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు.ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగా అతడి జట్టు కేవలం 41.2 ఓవర్లలోనే 407 పరుగుల లక్ష్యాన్ని సాధించి విజయం సాధించింది.

ఇది సమీర్ రిజ్వీ డబుల్ సెంచరీతో( Sameer Rizvi Double Century ) ముగిసిన మొదటి మ్యాచ్ కాదు.డిసెంబర్ 21న త్రిపురపై కూడా అతడు 97 బంతుల్లోనే 201 పరుగులు చేసి డబుల్ సెంచరీ సాధించాడు.ఈ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 20 సిక్సర్లు బాదిన రిజ్వీ, టోర్నీలో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ నమోదు చేశాడు.

Advertisement

అంతేకాకుండా మరికొన్ని మ్యాచ్‌ల్లో 153 పరుగులు, 137 నాటౌట్ ఇన్నింగ్స్‌లు ఆడుతూ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

గత ఏడాది మాత్రమే సమీర్ రిజ్వీ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు.చెన్నై సూపర్ కింగ్స్( CSK ) అతడిని రూ.8.4 కోట్లకు కొనుగోలు చేసినా పెద్దగా రాణించలేకపోయాడు.ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్( DC ) తరపున ఆడబోతున్న రిజ్వీ జట్టుకు కేవలం రూ.95 లక్షలకే దక్కాడు.సమీర్ రిజ్వీ ప్రదర్శనను పరిశీలిస్తే అతి త్వరలో టీంఇండియాలో చోటు కోసం గట్టిగానే సెలక్షన్ కమిటీకి సంకేతాలు ఇస్త్తున్నాడు.

దేశవాళీ క్రికెట్‌లో తన ప్రతిభను నిరూపించుకున్న ఈ యువ ఆటగాడు, త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌లోనూ రాణించి మరింత పేరు సంపాదించుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.మొత్తంగా, సమీర్ రిజ్వీ రెండు డబుల్ సెంచరీలతో అండర్-23 స్టేట్ ఎ ట్రోఫీని మరింత ఆకర్షణీయంగా మార్చడంలో కీలక పాత్ర పోషించాడు.

వాస్తును గుడ్డిగా నమ్మితే ఇలానే ఉంటుంది మరి.. (వీడియో)
Advertisement

తాజా వార్తలు