బికినీ విషయంలో సమంత పెద్ద గొడవ

ఈ ట్విట్టర్ గొడవలు సమంతని ఇప్పట్లో వదిలేలా లేవు.

అపుడెప్పుడో 1-నేనొక్కడినే పోస్టర్ మీద కామెంట్ చేసిందని మూడు నాలుగురోజులు ఇటు సమంతకి, అటు సమంతని సపోర్ట్ చేసిన హీరో సిద్ధార్థ్ కి చుక్కలు చూపించారు మహేష్ బాబు ఫ్యాన్స్.ఆ పగ ఇప్పటికీ అలానే ఉంది.వీలు చిక్కినప్పుడల్లా సమంతని ఓ రౌండ్ వేసుకుంటూనే ఉన్నారు ప్రిన్స్ అభిమానులు.

ఇప్పుడు మళ్ళీ సమంతపై పడ్డారు మహేష్ ఫ్యాన్స్.అయితే ఈసారి సమంత మహేష్ గురించి కాని, మహేష్ ఫ్యాన్స్ గురించి కాని ఏం కామెంట్ చేయలేదు.

మరి గొడవ ఏమిటి ? నిన్న ఏదో బీచ్ కి వెళ్ళినట్టుంది సమంత.తాను బికిని వేసుకున్న ఫోటోని పోస్ట్ చేయలేదు కాని, ఆ బికినిని పోస్ట్ చేసింది సమంత.

త్వరలో పెళ్ళి చేసుకోబోతున్న అమ్మాయి కావడం వల్ల కావచ్చు, ట్విట్టర్లో కొంచెం నెగేటివ్ రెస్పాన్స్ వచ్చింది.రేపటి తరాలకు ఇదేనా నువ్వు నేర్పేది అంటూ అడిగారు కొందరు ట్విట్టర్ యూజర్లు.

దాంతో సమంతకి కోపం వచ్చింది."రేపటి తరాలు ఏం నేర్చుకుంటారు అంటే మీ క్యారక్టర్ ని బట్టి కాదు, వేసుకునే బట్టల్ని బట్టి మీరి ఎలాంటి వారో నిర్ణయించడం నేర్చుకుంటారు" అంటూ ఎద్దేవా చేసింది సమంత.

అంతే, మళ్ళీ సమంత మీద పడ్టారు మహేష్ ఫ్యాన్స్.బట్టల్ని చూసి క్యారక్టర్ డిసైడ్ చేయకూడదు అన్నప్పుడు పోస్టర్ ని చూసి "1" లాంటి సినిమా మీద కామెంట్స్ ఎలా చేస్తావ్ అంటూ సమంత మీద దండయాత్ర జరిపారు.

సమంత ఎప్పటిలాగే సమాధానం ఇచ్చే ఓపిక లేక అందర్ని బ్లాక్ చేసుకుంటూపోయింది.

మే 1న ఇంటింటికీ పెన్షన్లు ఇచ్చేలా చూడాలని చంద్రబాబు లేఖ..!!

తాజా వార్తలు