స్టార్ హీరోయిన్ సమంత, నయనతార, విజయ్ సేతుపతి హీరోహీరోయిన్లుగా విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో తెరకెక్కిన కణ్మణి రాంబో ఖతీజా మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది.అయితే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు.
రెండు రోజుల క్రితమే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైనా హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాలలో సైతం ఈ సినిమా బుకింగ్స్ నిరాశాజనకంగా ఉన్నాయి.
మరోవైపు సమంత నటించిన శాకుంతలం సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్నా ఈ సినిమాపై పెద్దగా అంచనాలు ఏర్పడటం లేదు.
గుణశేఖర్ ఈ సినిమాపై అంచనాలు పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ ఉండటం లేదు.మరోవైపు సమంత నటిస్తున్న యశోద సినిమాను ఆమె ఫ్యాన్స్ కూడా పట్టించుకోవడం లేదు.
విజయ్ దేవరకొండ సమంత కాంబో మూవీపై మాత్రమే అంతోఇంతో అంచనాలు ఏర్పడ్డాయి.
సమంత కెరీర్ విషయంలో తప్పటడుగులు వేస్తున్నారని ఆమె ఫ్యాన్స్ నుంచి సైతం కామెంట్లు వినిపిస్తున్నాయి.

విడాకుల తర్వాత సమంత విషయంలో అక్కినేని ఫ్యాన్స్ కోపంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.అక్కినేని అభిమానులు సమంత సినిమాలను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపే ఛాన్స్ అయితే లేదని తెలుస్తోంది.రేపు స్టార్ హీరోయిన్ సమంత పుట్టినరోజు అనే విషయం తెలిసిందే.

సమంత పుట్టినరోజు కానుకగా విడుదలవుతున్న కణ్మణి రాంబో ఖతీజా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.ఈ సినిమా తెలుగు హక్కులు సైతం 3 కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తానికి అమ్ముడయ్యాయని బోగట్టా.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.
సమంత ఫ్యాన్స్ మాత్రం సమంత వరుస విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నారు.భవిష్యత్తు సినిమాల ఫలితాలపైనే సామ్ కెరీర్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు.







