Samantha : మందులే నాకు ఆహారమయ్యాయి.. ఎన్నో పోరాటాలు చేశా.. కన్నీటి కష్టాలు చెప్పుకున్న సమంత!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సమంత ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Samantha Writes Emotional Note As She Completes One Year Of Her Myositis Diagno-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే ఇటీవల శాకుంతలం సినిమా( Shaakunthalam )తో ప్రేక్షకులను పలకరించింది.అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.

ఇకపోతే సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.అలాగే హిందీలో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

గా గత కొద్ది రోజులుగా సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.ఇదే విషయాన్ని గత ఏడాది వెల్లడించింది సమంత.

నాగచైతన్య( Naga Chaitanya ) నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆ బాధ నుంచి నెమ్మదిగా కోరుకుంటున్న సమయంలోనే తనకు మయోసైటిస్( Myositis ) అనే వ్యాధి సోకిందని ఆమె వెల్లడించింది.దాంతో చాలా రోజులపాటు సినిమాలకు దూరంగా ఉంటూ విదేశాలకు వెళ్ళిపోయింది.మొత్తానికి తన మనోధైర్యంతో ఆ వ్యాధిని పోరాడి గెలిచి మళ్ళీ సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది.ఇది ఇలా ఉంటే తాజాగా సమంత తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఎమోషనల్ ట్వీట్ ని షేర్ చేసింది.

మయోసైటీస్ వ్యాధి బారిన పడిన తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలు, ఇబ్బందులు, తన వ్యక్తిగత జీవితంలో వచ్చిన మార్పులను ఈ పోస్టు ద్వారా షేర్‌ చేసుకుంది.కాగా ప్రస్తుతం సెర్బియాలో ఉన్న ఆమె అక్కడ సెర్చ్‌ ఆఫ్‌ సెయింట్‌ సావాను సందర్శిచింది.

అందుకు సంబంధించిన ఫొటోలు షేర్‌ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది.

ఎన్నడూ చేయనన్ని పూజలు, ప్రార్థనలు చేశాను.మయోసైటిస్‌ ఉందని తెలిసి ఏడాది అవుతోంది.ఈ సంవత్సరం ఎప్పుడూ ఊహించని సరికొత్త పరిస్థితులను ఎదుర్కొన్నాను.

నా శరీరంతో ఎన్నో పోరాటు చేశాను.చక్కెర, ఉప్పు లేని ఫుడ్‌ తిన్నాను.

వాస్తవంగా చెప్పాలంటే మెడిసిన్సే ఆహారం అయ్యాయి.కొన్నింటిని బలవంతగా మానుకోవాల్సి వచ్చింది.

మరి కొన్నింటిని ఇష్టం లేకున్నా అలవాటు చేసుకోవాల్సి వచ్చింది.ఆలోచించడం, ఆత్మ పరిశీలన చేసుకోవడంతోనే ఈ ఏడాది గడిచిపోయింది.

ప్రొఫెషనల్‌ ఫెయిల్యూర్స్‌ను కూడా ఫేస్‌ చేశాను.ఇంట్రెస్టింగ్‌( Samantha Social Media Post ) విషయమేమిటంటే.

ఈ ఏడాది ఎన్నడూ చేయనన్ని పూజలు, ప్రార్థనలు చేశాను.వరాలు, దీవెనల కోసం మాత్రం కాదు.

సమస్యలను ఎదుర్కొనే మానసిక శక్తి, ప్రశాంతతను ఇవ్వమని భగవంతుడిని ప్రార్థిచాను.అలాగే జీవితంలో గడ్డు పరిస్థితులు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నాను.

నా చేతుల్లో ఉన్నదైతే నేను కంట్రోల్‌ చేయగలను.

లేని దానిని వదిలేయడం అలవర్చుకున్నాను.గతాన్ని గుర్తుచేసుకుంటూ అక్కడే ఆగిపోకూడదు.నన్ను ప్రేమించే వారినే ప్రేమిస్తాను.

మీలో కూడా చాలామంది జీవితంలో కష్టాలను ఎదుర్కొని ఉంటారు.అలాంటివారి కోసం కూడా నేను ప్రార్థిస్తాను.

దేవుళ్లు కొన్ని సార్లు లేట్‌ చేస్తారేమో కానీ, ఎప్పటికీ మన విజ్ఞప్తులను తిరస్కరించారు.శాంతి, ప్రేమ, సంతోషం, శక్తిని కోరుకుంటే భగవంతుడు ఎప్పుడూ కాదనను.

ఈ ప్రపంచంలో ఎలాంటి స్వార్థం లేని అంశాలు ఇదే కదా మరి అంటూ ఎమోషనల్( Samantha Emotional ) గా నోట్ రాసుకొచ్చింది సామ్.ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు సమంతకు మద్దతుగా కామెంట్ చేస్తూ ఆమెకు ధైర్యాన్ని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube