టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి మనందరికీ తెలిసిందే.తెలుగు సినిమా ఇండస్ట్రీలో సమంతకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
కాగా గత కొన్ని నెలలుగా సమంత మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.ఇప్పుడిప్పుడే ఆ సమస్య నుంచి నెమ్మదిగా కోలుకుంటోంది.
సమంత వ్యాధితో బాధపడుతున్నప్పటికీ ఆమె అలాగే ప్రమోషన్స్ ను చేసిన విషయం తెలిసిందే.అంతే కాకుండా సినిమాకు తానే డబ్బింగ్ చెప్పుకుంది.

ఇకపోతే సమంత నటించిన యశోద సినిమా ఇటీవలె విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే.మంచి హిట్ టాక్ ని తెచ్చుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.అలాగే సమంత నటించిన శాంకుతలం సినిమా షూటింగ్ పూర్తి కాగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచునాలు నెలకొన్న విషయం తెలిసిందే.
ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అని సమంత అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఇకపోతే తాజాగా అందుకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

ప్రముఖ మీడియా సంస్థ ఓర్మార్క్స్ మీడియా 2022 డిసెంబర్ కి సంబంధించిన ఆల్ ఇండియా లెవెల్ మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ లిస్ట్ను విడుదల చేసింది.ఇక ఈ లిస్టులో సమంత టాప్ ప్లేస్ లో నిలవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.సమంత మొదటి స్థానంలో నిలవగా ఆ తర్వాత ఆలియా భట్, దీపికా, నయనతార, కాజల్, ఉండగా ఆరవ స్థానంలో రష్మిక మందన ఏడవ స్థానంలో కత్రినా కైఫ్, 8వ స్థానంలో త్రిష,తొమ్మిదవ స్థానంలో తమన్నా, 10వ స్థానంలో కీర్తి సురేష్ లు నిలిచారు.ఇకపోతే తాజాగా ఓర్మాక్స్ మీడియా సంస్థ విడుదల చేసిన ఈ ఫోటోతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.







