యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో, జాన్ అనే రెండు పెద్ద ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు.భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాలు ప్రభాస్ కెరియర్ లో చాలా కీలకమైనవి అనే విషయం అందరికి తెలిసిందే.
వీటితో బాలీవుడ్ లో కూడా తన సత్తా నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తున్న ప్రభాస్ దానికి తగ్గట్లే సినిమాని భారీ కాస్టింగ్ తో, ఇండియన్ ఆర్టిస్ట్స్ అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.ఇక ఈ రెండు సినిమాలపై టాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ దిల్ రాజు బ్యానర్ లో సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.అయితే ఆ సినిమాకి దర్శకుడు ఎవరనే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.
కాని కేజీఎఫ్ తో అందరి ద్రుష్టిని ఆకర్షించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.ఇక ప్రభాస్ కూడా ప్రశాంత్ నీల్ మేకింగ్ విజన్ చూసి అతనితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే దిల్ రాజు నిర్మించే సినిమాలో ప్రభాస్ కి జోడీగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించే అవకాశం ఉందని తాజాగా టాక్ వినిపిస్తుంది.

సమంత ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో 96 రీమేక్ లో నటిస్తుంది.ఇక దీంతో పాటు మరో రెండు ప్రాజెక్ట్ లు చేయడానికి ఆమె కమిట్ అయిందని తెలుస్తుంది.దీంతో సమంతని ప్రభాస్ కి జోడీగా సెట్ చేయాలని దిల్ రాజు ఆలోచిస్తున్నట్లు టాక్.
ఇప్పటి వరకు సమంత టాలీవుడ్ లో ప్రభాస్ తో తప్ప అందరు స్టార్ హీరోలతో నటించింది.ఇక వీళ్ళిద్దరి జోడీని స్క్రీన్ మీద చూస్తే ఎలా ఉంటుందో అని అప్పుడే ఆడియన్స్ ఆలోచించడం మొదలెట్టేసారు అని చెప్పాలి.