గ్రాండ్ విజువల్స్ తో 'శాకుంతలం' ట్రైలర్.. ఆసక్తిని పెంచేస్తుందిగా!

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రెసెంట్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.ఈమె ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయిన ముద్దుగుమ్మగా పేరు తెచ్చుకుంది.

ఇంతకు ముందులా కాకుండా పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటుంది.అయితే ఈమె వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే హెల్త్ ఇష్యు ఈమెను చుట్టూ ముట్టింది.

దీంతో సమంత ఇండస్ట్రీకి కొద్దీ రోజులు పూర్తిగా దూరం అయ్యింది.ఈమె అనారోగ్యానికి గురి అయినప్పటి నుండే ఎక్కడికక్కడ షూటింగులు ఆగిపోయాయి.

ఇప్పుడిప్పుడే హెల్త్ ప్రాబ్లెమ్ నుండి బయట పడుతుంది.త్వరలోనే మళ్ళీ వరుస షూటింగులతో బిజీ కానుంది.

Advertisement

ఇదిలా ఉండగా ప్రెజెంట్ ఈమె చేస్తున్న సినిమాల్లో శాకుంతలం ఒకటి.టాలీవుడ్ ఇండస్ట్రీలో చారిత్రక సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండటం విశేషం.

తాజాగా కొద్దిసేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.కాళిదాసు రచించిన శకుంతల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి స్పందన వచ్చింది.తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంటుంది.

మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, గుణశేఖర్ టేకింగ్, సమంత అందంతో పాటు అభినయం ప్రేక్షకులను కట్టి పడేస్తున్నాయి.ట్రైలర్ మొత్తం ఆకట్టుకునే డైలాగ్స్ తో నిండగా సినిమాపై ఆసక్తి పెంచేస్తుంది.ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

పాన్ ఇండియా వ్యాప్తంగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 17, 2023న థియేటర్ లలో రిలీజ్ కాబోతుంది.

Advertisement

ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను గుణ టీమ్ వర్క్స్ పై నీలిమ గుణ నిర్మించారు.ఇక ఈ సినిమాలో అల్లు అర్హ కూడా బాలనటిగా పరిచయం కాబోతుంది.చూడాలి ఈ సినిమాతో సమంత ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో.

https://youtu.be/66Kv0TdXYyk

తాజా వార్తలు