ఆ ప్రాజెక్ట్ షూట్ సమయంలో తల తిరిగేది.. సమంత సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కలిసి నటించిన తాజా సిరీస్ సిటాడెల్( Citadel ).

హనీ బన్నీ రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్( Amazon Prime ) వేదికగా ప్రసారం కానున్న విషయం మనందరికీ తెలిసిందే.

అయితే ఇది స్ట్రీమింగ్ కావడానికి మరికొద్ది రోజులే సమయం ఉండడంతో ఈ సిరీస్ మేకర్స్ ప్రస్తుతం వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.అందులో భాగంగానే తాజాగా సమంత ఒక పాడ్ కాస్ట్ లో షూటింగ్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.నేను ఇప్పటివరకు పనిచేసిన అత్యంత కష్టమైన ప్రాజెక్ట్‌ సిటాడెల్‌.ఈ టీమ్‌ నాలో ధైర్యాన్ని నింపింది.

ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటూ మద్దతునిచ్చింది.నాపై ఎంతో నమ్మకంతో ఈ సిరీస్‌ ను కొనసాగించింది.

Advertisement

వారికి నాపై నమ్మకం లేకుంటే నేను ఈరోజు ఇక్కడ ఉండేదాన్ని కాదు.జీవితంలో మనం కష్టాలను ఎదుర్కొనే సమయంలో దేవుడు కచ్చితంగా సాయం చేస్తాడు.

ఆ పరిస్థితుల నుంచి బయటపడడానికి సాయం చేసిన వారిని మనం ఎల్లప్పుడూ గుర్తుచుకోవాలి.వారిపై కృతజ్ఞతా భావంతో ఉండాలి.

రాజ్‌ అండ్‌ డీకేతో పాటు సిరీస్‌ బృందమంతా నన్ను జాగ్రత్తగా చూసుకుంది.ఇంత మంచి టీమ్‌ దొరికినందుకు నేనెంత అదృష్టవంతురాలినో అని అనిపించింది.

ఒక్కోసారి ఇంటెన్స్‌ యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో తల తిరిగేది.నావల్ల కాదు అనిపించేది.అయినా ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాను అని తెలిపారు సమంత.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

ఇక ఈ సిరీస్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్లో వరుణ్‌ కూడా సమంతపై ప్రశంసలు కురిపించారు.నిజాయతీగా చెప్పాలంటే సమంత( Samantha )తో పోలిస్తే నా పాత్ర చాలా సులభం.

Advertisement

ఆమె ఈ సిరీస్‌ షూటింగ్‌ సమయంలో ఎన్నో పోరాటాలు చేసింది.ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ షూట్‌ ను పూర్తి చేసింది.

ఎంతో మందికి సమంత స్ఫూర్తినిచ్చింది అని వరుణ్‌ ధావన్ చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు