సినిమాలు లేకపోయినా ఆ విషయంలో నెంబర్ వన్ హీరోయిన్ గా సమంత రికార్డ్!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి సమంత( Samantha ) ఒకరు.

ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు పుష్కరకాలం పూర్తి అవుతున్నప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు అని చెప్పాలి.

ఇలానటిగా వరుస సినిమా అవకాశాలను అందుకొని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి సమంతకు రోజురోజుకు అభిమానుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది.తాజాగా సమంత ఖుషి సినిమా ( Kushi Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.ఇలా ఈమె సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక సమంత వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి తరుణంలో ఆమె మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డారు.ఇలా మయోసైటిస్ వ్యాధికి( myositis ) గురి కావడంతో కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకున్న అనంతరం తాను కమిట్ అయినటువంటి సినిమాలు అన్నింటినీ పూర్తిచేసి సమంత ఏకంగా ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.ఇలా సమంత ప్రస్తుతం ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వకుండా పూర్తిగా తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

Advertisement

ఈ విధంగా ఈమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తన వెకేషన్స్ కి సంబంధించిన అన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ అభిమానులను సందడి చేస్తున్నారు.ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి సమంత సోషల్ మీడియాలో మాత్రం ఏ హీరోయిన్ సాధించలేనటువంటి రికార్డు సాధించారు.తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్( Instagram ) ఫాలోవర్స్ 30 మిలియన్లకు చేరింది ఇలా ఇంస్టాగ్రామ్ లో 30 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నటువంటి ఏకైక స్టార్ హీరోయిన్ సమంతగా రికార్డు సొంతం చేసుకుంది.

ఇలా ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ తెర వెకేషన్ కి సంబంధించిన కొన్ని అందమైన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

Advertisement

తాజా వార్తలు