టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్నటువంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) ఒకరు ఈయన చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగు చిత్ర పరిశ్రమలు ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.అనంతరం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాలో నటించి పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అందుకోవడమే కాకుండా గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ కూడా సంపాదించుకున్నారు.
ఇలా ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ నటిస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ఇక రాంచరణ్ ఇప్పటివరకు నటించిన సినిమాలలో ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో కలిసి నటించారు.
ఇలా రాంచరణ్ సినిమాలలో నటించినటువంటి వారిలో సమంత( Samantha )కూడా ఒకరు సమంత ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం( Rangasthalam ) సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.సమంత పెళ్లి తర్వాత ఈ సినిమాలో నటించారు అయితే ఈ సినిమా ఇటు రాంచరణ్ కెరియర్ కు అటు సమంత కెరీర్ కు ఎంతో ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి.
ఇక ఈ సినిమా సమయంలోనే సమంత రామ్ చరణ్ మధ్య ఎంతో మంచి అనుబంధం ఏర్పడిందట ఇద్దరు కూడా చాలా ప్రాణ స్నేహితులుగా మారిపోయారని తెలుస్తుంది.ఇలా వీరిద్దరి మధ్య ఎంత మంచి రిలేషన్ ఉండడంతో సమంతకు సంబంధించి అన్ని విషయాలు రాంచరణ్ కు తెలుసని వీరిద్దరి మధ్య ఉన్న ఈ స్నేహ బంధమే సమంతను కష్ట సమయాల నుంచి బయటపడేలా చేసిందని తెలుస్తుంది.సమంత నాగచైతన్య పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న తర్వాత సినిమాలపరంగా బిజీ అయ్యారు.అయితే అదే సమయంలోనే ఈమెకు మయో సైటిసిస్ వ్యాధి సోకిన విషయం మనకు తెలిసిందే.
ఇలా మయోసైటిసిస్ కారణంగా సమంత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ఇక సమంతకు రాంచరణ్ మంచి స్నేహితుడు కావడంతో ఆమె గురించి అన్ని విషయాలు తెలుసుకున్నటువంటి చరణ్ ఈ వ్యాధికి ట్రీట్మెంట్ గురించి కూడా ఉపాసన ద్వారా ఎంతో మంది డాక్టర్లతో మాట్లాడి సమంత కష్ట సమయంలో కూడా ఈయన ఎంతో అండగా నిలిచారని, చరణ్ తో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కారణంగానే సమంత ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి కూడా ఎంతో సహాయపడిందని తెలుస్తుంది.ఇక రాంచరణ్ సమంత ఇద్దరు మంచి స్నేహితులు కావడంతో సమంతకు ఉపాసనతో కూడా ఎంతో మంచి బాండింగ్ ఏర్పడింది.ఇక రంగస్థలం సినిమా తర్వాత సమంత రామ్ చరణ్ కాంబినేషన్లో ఇప్పటివరకు మరొక సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు.
అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు రంగస్థలం సినిమాకు సీక్వెల్ సినిమా చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు అంటూ గతంలో వార్తలు వస్తున్నాయి.ఇదే కనుక నిజమైతే మరోసారి తెరపై సమంత రామ్ చరణ్ జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.