ప్రతి ఒక్కరూ నన్ను అర్థం చేసుకున్నారు.. పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తా: సమంత

సినీనటి సమంత ( Samantha ) విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) జంటగా నటించిన చిత్రం ఖుషి( Khushi ) .ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హైదరాబాదులో ఎంతో ఘనంగా ఈ సినిమా మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

 Samantha, Vijay Devarakonda ,khushi ,myositis , Tollywood, Social Media,-TeluguStop.com

ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు.ఇక ఈ కార్యక్రమానికి సమంత కూడా హాజరై సందడి చేశారు.

ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా సమంత మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ ఈ సినిమాలోని పాటలు తనకు ఎంతో అద్భుతంగా నచ్చాయని తెలిపారు.మీ అందరితో పాటు తాను కూడా సెప్టెంబర్ ఒకటవ తేదీ ఈ సినిమాని చూడడం కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని సమంత వెల్లడించారు అదేవిధంగా తనకోసం నిర్మాతలు చాలా ఓపికగా ఎదురు చూసినందుకు ఈమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత సమంత మయోసైటీస్ వ్యాధికి గురైన సంగతి తెలిసిందే.

ఇలా ఈ వ్యాధి బారిన పడిన ఈమె ఈ సినిమా షూటింగుకు దూరంగా ఉన్నారు.అయినప్పటికీ సమంత ఆరోగ్యం కుదుటపడే వరకు కూడా దర్శకనిర్మాతలు ఆమెకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా తనకు సమయం ఇచ్చారని తనని అర్థం చేసుకొని ఎంతో ఓపికగా ఎదురుచూసిన దర్శక నిర్మాతలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు.ఇక అభిమానులను ఉద్దేశించి సమంత మాట్లాడుతూ మీకోసమే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను.తప్పకుండా పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చి మంచి సినిమాలను చేస్తాను అంటూ సమంత ఈ సందర్భంగా సామ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube