టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సమంత గత కొద్దిరోజులుగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే.
ఒకవైపు ఆ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ ని తీసుకుంటూనే మరొకవైపు వెబ్ సీరిస్ లలో సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.ఈ నేపథ్యంలోనే సమంత నటించిన యశోద, శాకుంతలం సినిమాలు రెండు డిజాస్టర్ లుగా నిలిచిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటిస్తోంది.

అప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింది.ఈ సినిమాతో పాటు బాలీవుడ్లో సిటాడెల్( Citadel ) అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది.ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది సమంత.
ఇది ఇలా ఉంటే తాజాగా ఖుషి సినిమా నుంచి ఆరాధ్య అనే ఒక లిరికల్ సాంగ్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఆ సాంగ్ యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్‌లో సమంత సింపుల్ లుక్‌లో సూపర్‌గా కనిపించింది.సామ్ లుక్ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు.

అయితే ఈ పోస్టర్‌లో సమంత వేసుకున్న చెప్పుల గురించి చర్చించుకుంటున్నారు.సొగసైన అప్రాజిత తూర్ ఖైత్ హీల్స్‌తో ఈ సాంగ్‌లో సమంత మరింత ఆకర్షణీయంగా కనిపించింది.అయితే సింపుల్ లుక్‌లో కనిపిస్తున్న వీటి ధర రూ.7,399.ఈ చెప్పులు సమంత లుక్‌ను మరింత పెంచాయంటున్నారు అభిమానులు.ఆ చెప్పులు కూడా ఎంతో అందంగా స్టైల్ గా ఉన్నాయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు సమంత అభిమానులు.
కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు సాంగులు కూడా సూపర్ హిట్ గా నిలవడంతో పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్నాయి.శివ నిర్వాన దశకత్వం వహించిన ఈ ఖుషి సినిమా( kushi movie ) సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.