సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రెసెంట్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.ఈమె ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయిన ముద్దుగుమ్మగా పేరు తెచ్చుకుంది.
ఇంతకు ముందులా కాకుండా పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటుంది.అయితే ఈమె వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే హెల్త్ ఇష్యు ఈమెను చుట్టూ ముట్టింది.
అయినా కూడా ఈమె ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా ముందడుగు వేస్తుంది.ట్రీట్ మెంట్ తీసుకుంటూ మెల్లగా ఈ వ్యాధి నుండి బయట పడుతుంది.మరి ఈమె పూర్తిగా కోలుకోకుండానే తన నెక్స్ట్ సినిమా ”శాకుంతలం” ప్రమోషన్స్ లో బిజీ కానుంది.సామ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటేనే ఈ సినిమా నార్త్ లో కూడా అంచనాలు పెంచుకుంటుంది.

అందుకే మేకర్స్ కూడా ఈ సినిమాను నార్త్ లో బాగా ప్రమోట్ చేయాలని సామ్ ను రంగంలోకి దించబోతున్నారట.చారిత్రక సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.తెలుగుతో పాటు మిగిలిన సౌత్ భాషలన్నిటిలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.అయితే ఈ సినిమాను నార్త్ లో కూడా రిలీజ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్.

సౌత్ పౌరాణిక సినిమాలకు నార్త్ లో మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో సామ్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని మరింత హైప్ తెచ్చేలా చేయాలని చూస్తుంది.మరి సామ్ ఒక్కసారి రంగంలోకి దిగితే శాకుంతలం మంచి ఓపెనింగ్స్ తెచ్చుకోవడం ఖాయం.ఇక ఈ సినిమా ఫిబ్రవరి 17, 2023న థియేటర్ లలో రిలీజ్ కాబోతుంది.గుణ టీమ్ వర్క్స్ పై నీలిమ గుణ నిర్మించిన ఈ సినిమాలో అల్లు అర్హ కూడా బాలనటిగా పరిచయం కాబోతుంది.







