బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.
ఇకపోతే సల్మాన్ ఖాన్ కు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ హీరో అయిన సల్మాన్ ఖాన్ ను చంపేస్తాము అంటూ కొందరు దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు.
సల్మాన్ ఖాన్ తో పాటుగా అతని తండ్రి సలీమ్ ను కూడా అంటూ లేఖ పంపారు.దీంతో సల్మాన్ ఖాన్ కు పంజాబ్ సింగర్ సిద్దూకి పట్టిన గతే పడుతుంది అని కొందరు హెచ్చరించారు.
అయితే ఈ లేఖతో ఒక్కసారిగా హడలిపోయిన సల్మాన్ ఖాన్ వెంటనే అప్రమత్తమై తాజాగా బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ లేఖ ఆధారంగా ఆ దుండగులను వెతికే పనిలో పడ్డారు.
గతంలో కూడా సల్మాన్ ఖాన్ కు చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.

కృష్ణ జింకను దైవంగా భావించే లారెన్స్ బిష్ణోయ్ కృష్ణజింకల వేట కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్‌ను చంపేస్తామని కోర్టు ఆవరణలోనే సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఈ మేరకు అతడి ముఠా సల్మాన్ హత్యకు పథకం పన్నగా పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.కాగా తీహార్ కోర్టులో ఉన్న బిష్ణోయ్ ఇటీవలే పంజాబ్ సింగర్ సిద్ధూను హతమార్చిన నేపథ్యంలో ఈ లేఖకు అతడి ముఠాకు ఏమైనా సంబంధం ఉందా? అన్నది తెలియాల్సి ఉంది.అయితే చాలా ఇదంతా కూడా బిష్ణోయ్ పనే అయి ఉంటుంది అని విశ్వసిస్తున్నారు.







