ప్రేమలు నాకు కలిసి రాలేదు... సల్మాన్ ఖాన్ కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ( Salman Khan ) ఇండస్ట్రీలో అద్భుతమైన నటుడిగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

అయితే ప్రస్తుతం ఈయన ఐదు పదుల వయసులో ఉన్నప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం.

అయితే ఈయన హీరోగా కొనసాగుతున్న సమయంలో ఇండస్ట్రీకి చెందినటువంటి ఎంతోమంది హీరోయిన్లతో ప్రేమలో పడ్డారు.అయితే ఆ ప్రేమలన్నీ కూడా బ్రేకప్ అయ్యాయని చెప్పాలి.

అయితే ఇప్పటికీ సల్మాన్ ఖాన్ డేటింగ్ రూమర్స్( Salman Khan Dating Rumors ) గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉంటాయి.ఇక తాజాగా సల్మాన్ ఖాన్ తన రిలేషన్షిప్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ఈయన హీరోగా నటించిన కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌( Kisi Ka Bhai Kisi Ki Jaan ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఒక కార్యక్రమంలో భాగంగా సల్మాన్ ఖాన్ పాల్గొని తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.తనకు ప్రేమలు పెద్దగా కలిసి రాలేదని తెలిపారు.

Advertisement

ప్రస్తుతానికి తాను అందరికీ బాయ్ అని సల్మాన్ వెల్లడించారు.నేను ఇష్టపడిన అమ్మాయి నన్ను జాన్ అని పిలిస్తే బాగుండేది.

కాని చివరికి వారు కూడా తనను బాయ్ అని పిలుస్తున్నారు.దానికి నేనేం చేయను అంటూ ఈయన కామెంట్స్ చేశారు.

ఇలా సల్మాన్ ఖాన్ గతంలో దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ ఐశ్వర్యరాయ్ వంటి పలువురు హీరోయిన్లతో ప్రేమ ప్రయాణాలు కొనసాగించారని వార్తలు వచ్చాయి.అయితే ప్రస్తుతం ఈ సినిమాలో పూజా హెగ్డే ( Pooja Hedge ) తో కలిసి నటించిన సల్మాన్ ఖాన్ పూజతో కూడా ప్రేమలో పడ్డారంటూ వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలను పూజా హెగ్డే ఖండించారు.

ఇలా సల్మాన్ ఖాన్ గురించి తరచూ ఇలాంటి వార్తలు వినపడుతూనే ఉంటాయి.అయితే ఈయన తాజాగా తన రిలేషన్ షిప్స్ గురించి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...
Advertisement

తాజా వార్తలు