చిన్న పని చేస్తే చాలు.. ప్రభాస్ సలార్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చు?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) నటించిన సలార్ ( Salaar ) చిత్రం ఎంత మంచి ఆదరణ సొంతం చేసుకుందో మనకు తెలిసిందే.ఈ సినిమా సుమారు 700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది.

 Salar Makers Gives Special Chance To Win Prabhas Motorcycle, Prabhas, Salar, Mot-TeluguStop.com

ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ప్రేక్షకులను ఫిదా చేసింది.ప్రశాంత్ నీల్( Prashanth Neel ) డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా థియేటర్లలో అలాగే డిజిటల్ మీడియాలోనూ సంచలనాలను సృష్టించింది.

అయితే త్వరలోనే ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.ఈనెల 21వ తేదీ ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైంది.

థియేటర్లోను డిజిటల్ మీడియాలోనూ సక్సెస్ అందుకున్నటువంటి ఈ సినిమాని బుల్లితెరపై కూడా హిట్ చేయడం కోసం మేకర్స్ బంపర్ ఆఫర్ ప్రకటించారు.కేవలం వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపిన ఐకానిక్ బైక్ ( Bike ) గెలుచుకునే అవకాశాన్ని అందుకోవచ్చు అంటూ చిత్రబృందం ఈ ఆఫర్ వెల్లడించారు.ఇదే విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఈ ఆదివారం స్టార్ మా లో ప్రసారం కాబోతున్నటువంటి ఈ సినిమాని చూస్తూ వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.సినిమా ప్రసారమయ్యే సమయంలో ఇచ్చిన ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పినవారికి ఆ బైక్ గెలిచే అవకాశముంటుందని తెలిపింది.చివరలో టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటూ స్పెషల్ గా తెలిపారు.

అయితే ఈ ప్రభావం సినిమాకి టీఆర్పీ రేటింగ్ పై ప్రభావం చూపబోతుందని తెలుస్తుంది.ఇలా మొదటి భాగం ఎంతో మంచి సక్సెస్ కాగా రెండో బాగం కూడా త్వరలోనే షూటింగ్ పనులు ప్రారంభించుకోబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube