చిన్న పని చేస్తే చాలు.. ప్రభాస్ సలార్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చు?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) నటించిన సలార్ ( Salaar ) చిత్రం ఎంత మంచి ఆదరణ సొంతం చేసుకుందో మనకు తెలిసిందే.

ఈ సినిమా సుమారు 700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది.

ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ప్రేక్షకులను ఫిదా చేసింది.ప్రశాంత్ నీల్( Prashanth Neel ) డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా థియేటర్లలో అలాగే డిజిటల్ మీడియాలోనూ సంచలనాలను సృష్టించింది.

అయితే త్వరలోనే ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

ఈనెల 21వ తేదీ ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైంది. """/" / థియేటర్లోను డిజిటల్ మీడియాలోనూ సక్సెస్ అందుకున్నటువంటి ఈ సినిమాని బుల్లితెరపై కూడా హిట్ చేయడం కోసం మేకర్స్ బంపర్ ఆఫర్ ప్రకటించారు.

కేవలం వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపిన ఐకానిక్ బైక్ ( Bike ) గెలుచుకునే అవకాశాన్ని అందుకోవచ్చు అంటూ చిత్రబృందం ఈ ఆఫర్ వెల్లడించారు.

ఇదే విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. """/" / ఈ ఆదివారం స్టార్ మా లో ప్రసారం కాబోతున్నటువంటి ఈ సినిమాని చూస్తూ వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.

సినిమా ప్రసారమయ్యే సమయంలో ఇచ్చిన ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పినవారికి ఆ బైక్ గెలిచే అవకాశముంటుందని తెలిపింది.

చివరలో టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటూ స్పెషల్ గా తెలిపారు.అయితే ఈ ప్రభావం సినిమాకి టీఆర్పీ రేటింగ్ పై ప్రభావం చూపబోతుందని తెలుస్తుంది.

ఇలా మొదటి భాగం ఎంతో మంచి సక్సెస్ కాగా రెండో బాగం కూడా త్వరలోనే షూటింగ్ పనులు ప్రారంభించుకోబోతుంది.

బీఆర్ఎస్ఎల్పి విలీనం దిశగా రేవంత్ స్కెచ్ ?