'ఆదిపురుష్' వసూళ్లకు దరిదాపుల్లో రాలేకపోతున్న 'సలార్'..ట్రేడ్ కి అతి పెద్ద షాక్!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ( Prabhas )హీరో గా నటించిన సలార్ చిత్రం ( Salaar )రీసెంట్ గానే విడుదలై సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

ప్రభాస్ నుండి ఒక్క పాజిటివ్ టాక్ వచ్చే సినిమా కోసం అభిమానులతో పాటుగా ట్రేడ్ కూడా ఎంత ఆసక్తిగా ఎదురు చూసింది.

వాళ్ళ ఎదురు చూపులకు మొత్తానికి తెరపడింది.అయితే ఈ సినిమా కొన్ని సెలెక్టెడ్ ప్రాంతాలలో మాత్రమే బాగా ఆడుతుంది.

నైజాం లో మొదటి రోజు నుండి సెన్సేషనల్ వసూళ్లను సొంతం చేసుకుంటుంది.మరో రెండు రోజులు ఆగితే ఈ ప్రాంతం లో బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా అందుకుంటుంది.

ఇక ఆంధ్ర ప్రదేశ్ లో మార్నింగ్ షోస్ కి పెద్దగా వసూళ్లు రాకపోయినా, మ్యాట్నీ నుండి పికప్ అవుతున్నాయి.ఓవరాల్ గా మంచి వసూళ్లనే ఈ ప్రాంతం లో నమోదు చేసుకుంటుంది.

Salar Is Not Able To Come Close To Adipurushs Collections...the Biggest Shock
Advertisement
Salar Is Not Able To Come Close To Adipurush's Collections...the Biggest Shock

ఇక ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి వేరే లెవెల్ వసూళ్లు వస్తున్నాయి.ఇప్పటికే 7 మిలియన్ డాలర్ల వసూళ్లకు అతి చేరువ లో ఉన్న సలార్, ఫుల్ రన్ లో 10 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఇవన్నీ పక్కన పెడితే హిందీ మార్కెట్ గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాలి.

ఈ ప్రాంతం లో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మొదటి మూడు రోజులు రోజుకి 30 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టి, మూడు రోజుల్లో వంద కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను అందుకుంది.కానీ సలార్ చిత్రం ఆదిపురుష్ హిందీ వసూళ్లకు దరిదాపుల్లో కూడా లేకపోవడం విశేషం.

ఈ ప్రాంతం లో సలార్ చిత్రానికి మొదటి రోజు 15 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు రాగా, రెండవ రోజు 13 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి.

Salar Is Not Able To Come Close To Adipurushs Collections...the Biggest Shock

ఆదిపురుష్ హిందీ వెర్షన్ కి మొదటి రోజు దాదాపుగా 38 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వస్తే, సలార్ చిత్రానికి రెండు రోజులు కలిపినా కూడా అంత వసూళ్లు రాకపోవడం బాధాకరం.ఓవరాల్ గా చూసుకుంటే ఈ చిత్రానికి ఫుల్ రన్ లో వంద కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు రావడం కూడా కష్టమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు.అదే కనుక జరిగితే ప్రభాస్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel )కాంబినేషన్ పరువు మొత్తం పోయినట్టే అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

ఎందుకంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 దాదాపుగా 500 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది.సలార్ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ 200 కోట్ల రూపాయిలు ఉంది.

Advertisement

ఆ మార్కుని అందుకోవడం అసాధ్యమే.కాబట్టి పాజిటివ్ టాక్ తో హిందీ వెర్షన్ లో వంద కోట్ల రూపాయిల నష్టం రాబడుతున్న మొట్టమొదటి సినిమాగా సలార్ నివ్వబోతుంది అన్నమాట.

తాజా వార్తలు