తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు ఏ హీరోకు దక్కని గ్రాండ్ ఎంట్రీ బెల్లంకొండ శ్రీనివాస్‌కు దక్కిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.నిర్మాత అయిన బెల్లంకొండ సురేష్ చాలా తెలివిగా తన కొడుకుతో వరుసగా పెద్ద బడ్జెట్ చిత్రాలను చేస్తూ వస్తున్నాడు.
అల్లుడు శీను నుండి మొన్న విడుదలైన ‘సాక్ష్యం’ చిత్రం వరకు అన్ని కూడా 40 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కినవే.కొత్త హీరోలు, అది కూడా స్టార్ స్టేటస్ లేని వారసుడు మొదటి సినిమాకు అయిదు నుండి పది కోట్లు పెట్టడమే చాలా ఎక్కువ.
కాని బెల్లంకొండ సురేష్ ఏ నమ్మకంతోనే మొదటి సినిమాకే తన కొడుకు కోసం ఏకంగా 40 కోట్లకు పైగా ఖర్చు చేయించాడు.

ఆ తర్వాత సినిమాలను తాను నిర్మించకున్నా కూడా వెనుక ఉండి బెల్లంకొండ సురేష్ తన కొడుకు ప్రతి సినిమాను కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కేలా ప్లాన్ చేస్తున్నాడు.భారీ బడ్జెట్‌తో చిత్రాలు చేస్తున్న కారణంగా సక్సెస్ అయినా కూడా వసూళ్లు మాత్రం నమోదు కావడం లేదు.కొత్త హీరో సినిమా 10 కోట్లు వసూళ్లు చేసింది అంటే అదో పెద్ద గొప్ప విజయంగా చెప్పుకుంటారు.
అదే బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ 20 కోట్లకు తగ్గకుండా వసూళ్లు చేస్తుంది.ఇప్పటి వరకు విడుదలైన దాదాపు అన్ని చిత్రాలు కూడా మంచి కలెక్షన్స్‌ను వసూళ్లు చేశాయి.
అయినా కూడా నిర్మాతకు నష్టం వచ్చింది.

ప్రతి సినిమా కూడా 40 కోట్లకు మించిన బడ్జెట్‌తో తెరకెక్కుతున్న కారణంగా అంతటి వసూళ్లు సాధ్యం కావడం లేదు.వరుసగా చిత్రాలు చేస్తున్న బెల్లంకొండ ఇప్పటి వరకు ఏ సినిమాతో కూడా పెట్టిన పెట్టుబడి మొత్తం రికవరీ చేయడంలో విఫలం అయ్యాడు.తాజాగా విడుదలైన ‘సాక్ష్యం’ చిత్రం కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కారణంగా రికవరీ అవ్వడం కష్టంగానే ఉంది.
గత చిత్రాల మాదిరిగానే ‘సాక్ష్యం’ చిత్రం కూడా 40 కోట్ల బడ్జెట్‌తో నిర్మాణం జరిగింది.విడుదకు ముందు అన్ని ఏరియాల్లో కలిపి ఈ చిత్రం 25 కోట్లకు అమ్ముడు పోయింది.
మొదటి మూడు రోజుల్లో 8 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
లాంగ్ రన్‌లో మరో పది కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది.
డిస్ట్రిబ్యూటర్లు నష్టపోక తప్పదని అనిపిస్తుంది.మొత్తంగా 20 కోట్లు వసూళ్లు చేసినా కూడా ఈ చిత్రంకు నష్టాలు తప్పేలా లేవు.
సినిమాకు 25 కోట్లు థియేట్రికల్ రైట్స్ ద్వారా మరో 15 కోట్లు ఇతర రైట్స్ ద్వారా వస్తాయని చిత్ర నిర్మాతలు ఆశించారు.కాని చూస్తుంటే నిర్మాతలు లాస్‌ను భరించాల్సి వస్తుందనిపిస్తుంది.
బెల్లంకొండ వంటి చిన్న హీరోతో 25 కోట్ల లోపు బడ్జెట్‌తో సినిమా చేస్తే భారీ లాభాలు రావడం ఖాయం.కాని స్టార్ హీరోగా చూపించేందుకు బెల్లంకొండ సురేష్ విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.







