మహేంద్రసింగ్ ధోని( Mahendrasingh Dhoni ) క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉండిపోయే పేరు.2020 ఆగస్టు 15న మహేంద్రసింగ్ ధోని క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.కానీ ఆగస్టు 15న మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు ఎందుకు పలికాడో అనే విషయం ఎవరికీ తెలియదు.ఆరోజు రిటైర్మెంట్ ప్రకటించడానికి గల కారణం ఏమిటో ఆయన భార్య సాక్షి ధోని( Sakshi Dhoni ) తాజాగా ఒక ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియజేశారు.
మహేంద్రసింగ్ ధోని భార్య సాక్షి ధోని మంగళవారం ఒక ఇంస్టాగ్రామ్ స్టోరీలో మహేంద్రసింగ్ ధోనికి, ఆగస్టు 15వ తేదీకి( August 15 ) ఉన్న స్పెషల్ బాండింగ్ ఏమిటో తెలిపారు.ఆగస్టు 15 అంటే మహేంద్రసింగ్ ధోని కి చాలా స్పెషల్.
ఆగస్టు 15 మహేంద్రసింగ్ ధోని తల్లి పుట్టినరోజు. అందుకే ఆగస్టు 15న మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.
పాన్ సింగ్ ధోని, దేవకీదేవి దంపతులకు ముగ్గురు పిల్లలు సంతానం.వీరిలో చివరి సంతానంగా 1981 జులై 7న మహేంద్రసింగ్ ధోని జన్మించాడు.మహేంద్ర సింగ్ ధోనికు నరేంద్ర సింగ్ ధోని అనే అన్న, జయంతి గుప్తా అనే అక్క ఉన్నారు.ధోని తల్లి దేవకీదేవి( Devakidevi ) తన జీవితమంతా గృహిణిగా బాధ్యతలు నిర్వహించారు.

సాక్షి ధోని తన అత్తగారితో తనకు చాలా మంచి బంధం ఉందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.సాక్షి ధోని పెళ్లికి ఒకరోజు ముందే తన అత్తగారిని కలుసుకున్నట్లు చెప్పారు.తాము అత్త,కోడళ్ళ మాదిరిగా కాకుండా మంచి స్నేహితులుగా ఉంటూ, ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటామని సాక్షి ధోని చెప్పారు.తన అత్తగారు ప్రతి విషయంలో తనకే మంచి సపోర్టుగా ఉంటారని సాక్షి ధోని ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.

ఇక మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి మూడేళ్లు గడిచాయి.ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు( Chennai Super Kings ) నాయకత్వం వహిస్తున్న మహేంద్రసింగ్ ధోని 42 ఏళ్ల వయసులో కూడా చెన్నైని రికార్డు స్థాయిలో నడిపించి 5వ టైటిల్ సాధించి పెట్టాడు.ఐపీఎల్ 2024లో కూడా మహేంద్రసింగ్ ధోని చెన్నై జట్టుకు నాయకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.







