కోహ్లీ డకౌట్ ను ఓ రేంజ్ లో వాడుకున్న సజ్జనార్..!

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తనదైన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు.మొదట దిశ ఘటనలో నిందితుల ఎన్ కౌంటర్ తో ఆయన పేరు హాట్ టాపిక్ అయ్యింది.

 Sajjanar Uses Kohli Duckout In A Range, Virat Kohli, Tsrtc Md Vc Sajjanar , Sarj-TeluguStop.com

మెయిన్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ ఆయనపై అభినందనలు వెల్లువెత్తాయి.అయితే.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సజ్జనార్ ను తెలంగాణ ఆర్టీసీకి ఎండీగా నియమించింది.ఆర్టీసీ ఎండీగా… సజ్జనార్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఇప్పటికే పలు కీలక నిర్ణయాలతో ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకెళ్లారు ఎండీ సజ్జనార్‌.దీంతో పాటు సంస్థను ప్రమోట్ చేయడానికి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు.

ఇందులో భాగంగానే విరాట్‌ కోహ్లీ ఆటపై ట్వీట్‌ చేశారు.

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఏప్రిల్‌ 19 న లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గోల్డెన్‌ డకౌట్ అయిన విషయం తెలిసిందే.

కోహ్లి అలా డకౌట్ కాగానే పెట్టిన ఎక్స్‌ప్రెషన్స్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరలవుతున్నాయి.ఆ ఎక్స్‌ప్రెషన్స్‌ పై నెటిజన్ల నుండి పలు రకాల స్పందన వస్తుంది.

అందరి నెటిజన్ల లాగే కోహ్లి గోల్డెన్‌ డక్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ పై టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ కూడా స్పందించాడు.కోహ్లీ ఎక్స్‌ప్రెషన్ ని వాడుకుని ఆర్టీసీ క్రేజ్‌ పెంచే ప్రయత్నం చేశారు సజ్జనార్.

Telugu Virat Kohli, Sarjanar, Telangana, Tsrtcmd-Latest News - Telugu

కోహ్లి ఎక్స్‌ప్రెషన్స్‌కు సంబంధించిన ఫొటోను తన అఫీషియల్ ట్విటర్‌ లో పోస్ట్‌ చేస్తూ ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు.కండక్టర్‌ గారు వచ్చి పాస్ అడిగినప్పుడు, బస్ పాస్ ఇంట్లో మర్చిపోయిన మన రియాక్షన్.మీరు ఎప్పుడైనా పాస్ మర్చిపోయి బస్ ఎక్కారా.? మీ అనుభవాలను మాతో షేర్‌ చేసుకోండి అంటూ ఫన్నీగా ట్వీట్‌ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube