Sajjala Ramakrishna Reddy : చంద్రబాబు అద్దె మైక్ అంటూ వైయస్ షర్మిల పై సజ్జల రామకృష్ణారెడ్డి సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల( AP PCC Chief YS Sharmila ) రచ్చబండ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది.

గురువారం ఏలూరు జిల్లాలో షర్మిల పర్యటించి.

చంద్రబాబు, ఏపీ సీఎం జగన్ ల పై విమర్శలు చేయడం జరిగింది.ఇదిలా ఉంటే వైయస్ షర్మిలపై ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) మండిపడ్డారు.

గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( TDP Chandrababu Naidu ) ఢిల్లీ పర్యటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.టీడీపీ బలహీనంగా ఉంది కాబట్టే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని విమర్శించారు.

పొత్తుల కోసం చంద్రబాబు ఎక్కడికైనా వెళ్తాడు.బీజేపీతో ఏదో రకంగా పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నం.

Sajjala Ramakrishna Reddy Serious Comments On Ys Sharmila Saying Chandrababu Re
Advertisement
Sajjala Ramakrishna Reddy Serious Comments On Ys Sharmila Saying Chandrababu Re

ఐదేళ్లలో మేము చేసిన సంక్షేమం చెప్పే ఓట్లు అడుగుతున్నా.సీఎం జగన్( CM YS jagan ) చేసిన అభివృద్ధి మరోసారి వైసీపీని గెలిపిస్తుంది.ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఉనికే లేదు.

చంద్రబాబు అధ్యమైకులా షర్మిల మాట్లాడుతున్నారు.తెలుగుదేశం నేతలకు సమాధానం చెబితే షర్మిలకు చెప్పినట్లే అని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో ఇండియాటుడే సర్వేపై కూడా మండిపడ్డారు.గతంలో చేసిన ఇదే సర్వేలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చారు.

ఆ సంస్థ సర్వే విశ్వసనీయత ఏమిటనేది దీన్ని బట్టి తెలుస్తోంది.బీజేపీ నాయకులను తిట్టిన చంద్రబాబు తిరిగి ఆ పార్టీ నాయకులను కలవడం విడ్డూరంగా ఉందని అన్నారు.

వామ్మో.. ఇంగువతో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా?

తెలుగుదేశం పార్టీకి 18 మంది ఎమ్మెల్యేల బలము ఉంటే రాజ్యసభకు ఎలా పోటీ చేస్తారని నిలదీశారు.చంద్రబాబు ఏమనాలనుకుంటున్నారో అవే మాటలు షర్మిల నోట వస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు