మరి జగన్ ఎందుకు అంత భయపడుతున్నాడు?

ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి శుక్రవారం తేల్చి చెప్పారు.ముందస్తు ఎన్నికలపై వస్తున్న చర్చలను కొట్టిపారేసిన ఆయన.

ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రతిపక్షాలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని అన్నారు.2019లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు ఐదేళ్లపాటు ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారని, చివరి నిమిషం వరకు ప్రభుత్వం కొనసాగుతుందని అన్నారు.అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే.

కేసీఆర్ ను మించిన మెజారిటీ జగన్ ప్రభుత్వానికి ఉంది.ఉపఎన్నికలైనా, కార్పోరేట్ అయినా, మున్సిపల్ అయినా వారికి ఎదురులేదు.

అలాంటిది వైసీపీ ఎందుకు ముందస్తు ఎన్నికలకు వెనకడుగు వేస్తుంది అన్నాడు అంటచిక్కని సందేహం.పైగా తెదేపా, జనసేన పార్టీలు ఆర్థికంగా ప్రస్తుతం పెద్ద బలంగా లేవు.

బీజేపీ కి పటిష్టత లేదు.

Advertisement

బహుశా అభివృద్ధి విషయంలో వీరు మూకుమ్మడిగా విఫలం కావడం ఒక కారణం అయితే. ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి పక్కన లేకపోవడం మరొకటి కావచ్చు.జగన్ కంటే బాబు కొన్ని విషయాల్లో అనుభవజ్ఞుడు.

పైగా మెజారిటీ మరీ పడిపోతే జగన్ అసలు ఊరుకోడు.కాబట్టి ప్రభుత్వ సలహాదారులు సైతం ఈ మార్గాన్ని సూచించలేదు అన్నది భోగట్టాఇక సజ్జల చూస్తే ప్రతిపక్షాలు, ఒక వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అంటున్నారు.

విమర్శల హద్దులు దాటినందుకు సజ్జల ఏకంగా మీడియాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ఆంధ్రప్రదేశ్‌లోని ఓ వర్గం మీడియా ప్రజల్లో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోందన్నారు.

ఈ మీడియా అధినేతలు ప్రతిపక్ష పార్టీలతో రాజకీయ పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు.ప్రజలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ వెంటే ఉన్నారని, సోషల్‌ మీడియా ఉన్నందున మీడియా అబద్ధాలను కొనుగోలు చేయడం లేదని ఆయన అన్నారు.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

పార్టీలకు అతీతంగా ప్రభుత్వం చేస్తున్న అన్ని ప్రయోజనాలు ప్రజలకు అందుతున్నాయన్నారు.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నగదు లబ్ధిని నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో అవినీతి అట్టడుగు స్థాయికి చేరుకుందని సజ్జల అన్నారు.గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పరిపాలన వికేంద్రీకరణ చేయడం, ఇంటింటికీ పింఛన్లు, రేషన్ పంపిణీ చేయడం వల్ల ప్రజల కష్టాలు తగ్గాయని, దీంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.

Advertisement

మరి ఇంత సంతోషంగా ప్రజలు ఉంటే.ముందస్తు ఎన్నికలకు మీకేం అడ్డు ఉంది సార్.అన్నది పలువురి ప్రశ్న.!.

తాజా వార్తలు