స్టార్ హీరోయిన్ సాయిపల్లవి ( Sai Pallavi )దాదాపుగా దశాబ్ద కాలం నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.సాయిపల్లవి సినిమాల్లోకి రాకముందు ఢీ షోలో డ్యాన్స్ కంటెస్టెంట్ గా చేశారనే సంగతి తెలిసిందే.
అయితే ప్రతి సినిమాలో సాయిపల్లవి డ్యాన్స్ స్టెప్స్ ఒకే విధంగా ఉంటాయని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
వాస్తవానికి సాయిపల్లవి ఎలాంటి డ్యాన్స్ స్టెప్స్ అయినా అలవోకగా చేయగలరు.
కొరియోగ్రాఫర్లు ( Choreographers )ఎలాంటి స్టెప్స్ కంపోజ్ చేస్తే ఆ స్టెప్స్ మాత్రమే సాయిపల్లవి వేస్తారు తప్ప సాయిపల్లవి తన పాటకు సొంతంగా కొరియోగ్రఫీ చేసుకోరు.ప్రతి సినిమాలో సాయిపల్లవి స్టెప్స్ ఒకే విధంగా ఉంటాయని కొంతమంది అనిపించినా ఒకే తరహా స్టెప్స్ వేసి కూడా సాయిపల్లవి మెప్పిస్తున్నారంటే గ్రేట్ కదా అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

సాయిపల్లవి ఫస్ట్ సినిమాలో ఏ లుక్ లో కనిపించారో ఇప్పటికీ అదే లుక్ ను మెయింటైన్ చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.సాయిపల్లవికి బ్యాక్ టు బ్యాక్ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.సాయిపల్లవి పారితోషికం కూడా 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ ( 4 to 5 crores range )లో ఉందని సమాచారం అందుతోంది.సాయిపల్లవి మంచి పాత్రలకు మాత్రమే ఓటేస్తున్నారు.

సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్ ఇస్తే సినిమా హిట్ అనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది.సాయిపల్లవి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.సాయిపల్లవి తమిళ, తెలుగు భాషల్లో తన రేంజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.సాయిపల్లవి బాలీవుడ్ లో కూడా సత్తా చాటడం పక్కా అని చెప్పవచ్చు.సాయిపల్లవికి 2025 కూడా కెరీర్ పరంగా కలిసొచ్చిందని చెప్పవచ్చు.తండేల్ సినిమా ఫుల్ రన్ లో 100 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉంది.