తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో సాయిరాం శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగులో నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు శంకర్.
కాగా హీరో సాయిరాం శంకర్( Sairam Shankar ) టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ( Director Puri Jagannath )తమ్ముడు అన్న విషయం మనందరికీ తెలిసిందే.అయితే తమ్ముడు ని పెద్ద స్టార్ హీరో చేయడం కోసం పూరి జగన్నాథ్ ఎంతో ప్రయత్నించాడు.
కానీ అనుకున్న రేంజ్ కి సాయిరాం చేరలేకపోయాడు.

అలా అని సినిమాలకు దూరంగా ఉండకుండా సినిమా ఇండస్ట్రీ వెళ్లకుండా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.తన ట్యాలెంట్ తో తాను ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు.బంపర్ ఆఫర్ లాంటి సినిమా సాయిరాంకి మంచి గుర్తింపును తీసుకొచ్చింది.
ఆ సినిమాతో అందరికీ బాగా రీచ్ అయ్యాడు.ఆ తర్వాత చాలా సినిమాలు చేసాడు గానీ అనుకున్న స్థాయిలో సక్సెస్ అవ్వలేదు.
కాగా ఇటీవలే వెయ్ దరువెయ్ అంటూ మరో సినిమాతో కూడా ప్రేక్షకుల ముందు కొచ్చాడు.ఆ సంగతులు పక్కన బెడితే సాయిరాం శంకర్ ఫ్యామిలీ గురించి మాత్రం మీడియాకి తెలియని సంగతులు చాలానే ఉన్నాయి.

పూరి జగన్నాధ్ ఫ్యామిలీ ఎప్పటి కప్పుడు మీడియాలో కనిపిస్తూ ఉంటుంది.భార్య లావణ్య( Lavanya ) పిల్లలు ఆకాష్( Akash ) , కుమార్తె తరుచూ కనిపిస్తుంటారు.కానీ సాయిరాం భార్య పిల్లలు ఎక్కడా? అంటూ చాలాసార్లు చర్చకు దారి తీసింది.చాలా మంది ఆయనకు ఇంతవరకూ పెళ్లి కాలేదని చేసుకోలేదనుకున్న వారు చాలా మంది ఉన్నారు.
సాయిరాంకి ఇద్దరు ఆడపిల్లలు.వాళ్లు చదువుకుంటున్నారు.
అయితే సాయిరాం ది వివాహమా? పెద్దలు కుదిర్చిన పెళ్లా? అన్నది తెలియదు గానీ అనంతపురం అల్లుడిని అని ఓపెన్ అయ్యాడు.అనంతపురం అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు పనిగట్టుకుని అడిగితే చెప్పాడు.లేదంటే? ఆ విషయాలు ఎప్పటికీ మీడియాకి దూరంగానే ఉంచేవాడు ఏమో! అవి చెప్పడానికో చాలా అసౌకర్యానికి గురైనట్లు కనిపించాడు.ఇక ఇండస్ట్రీలో తనకు అన్నల సహకారం ఎంతో ఉందని, ఇప్పటికీ ఉందని తెలిపాడు.
డైరెక్టర్ అన్నయ్య కంటే ఎమ్మెల్యే అన్నయ్య సహకారం ఎక్కువగా ఉంటుందన్నాడు.అందువల్లే ఇలా సినిమాలు చేయగల్గుతున్నానని తెలిపాడు.
అలాగే స్టార్స్ తో అంటూ పెద్దగా స్నేహాలు లేవుగానీ డైరెక్షన్ డిపార్ట్ మెంట్ వాళ్లతోనే ఎక్కువగా స్నేహ ఉందని వాళ్లతోనే రెగ్యులర్ గా ఉంటానని తెలిపారు సాయిరాం.