స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ప్రేక్షకుల్లో భారీస్థాయిలో గుర్తింపు ఉంది.త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో నటించడానికి టాలీవుడ్ స్టార్ హీరోలు చాలా ఆసక్తిని చూపిస్తున్నారనే సంగతి తెలిసిందే.
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ సినిమా స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నారు.మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ కు స్క్రీన్ ప్లే, మాటలు అందించిన త్రివిక్రమ్ వినోదాయ చిత్తం రీమేక్ కు కూడా స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తుండటం గమనార్హం.
ఈ సినిమాతో పాటు పవన్ వైష్ణవ్ తేజ్ కాంబో మూవీకి త్రివిక్రమ్ కథ, మాటలు అందిస్తున్నారని పవన్ మూడు సినిమాలకు పని చేయడం వల్ల త్రివిక్రమ్ కు 40 కోట్ల రూపాయల నుంచి 50 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా దక్కుతోందని ప్రచారం జరుగుతోంది.అయితే ఈ ప్రచారం గురించి ప్రచురితమైన కథనం గురించి ఒక నెటిజన్ స్పందిస్తూ “సెట్స్ లో లుంగీ కట్టుకుని తిరుగుతూ రీమేక్ కథకు నా కొడకా నా కొడకా అంటూ డైలాగ్స్ యాడ్ చేసి త్రివిక్రమ్ కోట్ల రూపాయలు జేబులో వేసుకున్నాడని ఇదిరా లైఫ్” అంటూ కామెంట్ పెట్టాడు.
ఆ కామెంట్ గురించి ప్రముఖ దర్శకుడు సాయిరాజేష్ స్పందిస్తూ త్రివిక్రమ్ స్టార్ రైటర్ గా, స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకోవడానికి ముందు ఎదుర్కొన్న కన్నీటి కష్టాలను చెప్పుకొచ్చారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ 1500 రూపాయలు అద్దె చెల్లిస్తూ షేరింగ్ రూమ్ లో జీవనం సాగించారని 50 సినిమాలకు ఘోస్ట్ రైటర్ గా పని చేశారని ఫస్ట్ బ్రేక్ రావడానికి పదేళ్ల సమయం పట్టిందని అన్నారు.
ఏదీ ఊరికే రాదని త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకుంటున్న కళ్లు చెదిరే రెమ్యునరేషన్ గురించి సాయిరాజేష్ క్లారిటీ ఇచ్చారు.త్రివిక్రమ్ తన ప్రతిభతో డబ్బు సంపాదించుకుంటున్నారని నెటిజన్లు, త్రివిక్రమ్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో త్రివిక్రమ్ సినిమాలకు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే.