Sai Pallavi :షూటింగ్ లొకేషన్ లో ఆ రెండు పక్క ఉండాల్సిందే !

సాయి పల్లవి( Sai Pallavi ) …డాక్టర్ అయ్యాక యాక్టర్ గా ప్రస్తుతం కెరియర్ కొనసాగిస్తున్న చాలామంది హీరోయిన్స్ లాగా ఈమె కూడా బోలెడంత టాలెంట్ ఉన్న అమ్మాయి.మలయాళ ఇండస్ట్రీలో ప్రేమమ్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది, తెలుగులో ఫిదా చేసి ప్రస్తుతం ఇక్కడే పాతుకు పోయింది.

 Sai Pallavi Wish List In Location-TeluguStop.com

తెలుగుతో పాటు తమిళ్, మలయాళం లో కూడా సినిమాలు తీస్తున్న సాయి పల్లవి సీతగా ఫ్యాన్ ఇండియా సినిమాలో నటించబోతుంది.వేరే భాషల సంగతి పక్కన పెడితే తెలుగులో సాయి పల్లవి అంటే ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది ఆమెకి ఒకప్పుడు విజయశాంతి( Vijayashanti ) ని లేడీ అమితాబ్ అంటూ ఎంత క్రేజ్ ఉండేదో ప్రస్తుతం సాయి పల్లవి కి కూడా అంతే క్రేజ్ ఉంది.

Telugu Fidaa, Gargi, Kollywood, Premam, Sai Pallavi, Tollywood, Vijayashanti-Mov

సాయి పల్లవి సినిమాల ఎంపిక కాని ఆమె నడుచుకునే విధానం కానీ సినిమా ఇండస్ట్రీలో పెద్దలతో వ్యవహరించే తీరు కానీ చూడ ముచ్చటగా ఉంటుంది.ఆమె పై పెద్ద కంప్లైంట్స్ ఏమీ ఉండవు.బుక్స్ చదువుతుంది, నచ్చితేనే సినిమాలో చేస్తుంది, ముదు సీన్స్ అస్సలు చెయ్యదు, ఎక్స్పోజింగ్ కి ఆమడ దూరంలో ఉంటుంది, ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉండాలి.ఇవి మాత్రమే ఆమె చెక్ లిస్ట్ లో ఉంటాయి.

ఇలా ఉంటేనే డబ్బు లేకపోయినా సరే సినిమా తీస్తుంది.రెమ్యునరేషన్( Remuneration ) కోసం సినిమాలు చేసే టైప్ కాదు సాయి పల్లవి.

ఆమె విలువలకు కేరాఫ్ అడ్రస్ అని అందరూ అంటూ ఉంటారు.ఇలా ఈ మధ్యకాలంలో వేరే హీరోయిన్స్ ఎవరూ లేరు.

ఎన్ని కోట్లు ఇస్తున్నారు అనేది మాత్రమే దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీస్తూన ఈ కాలంలో సాయి పల్లవి లాంటి ఒక భిన్నమైన ఆలోచన విధానం ఉన్న అమ్మాయి దొరకడం చాలా కష్టం.

Telugu Fidaa, Gargi, Kollywood, Premam, Sai Pallavi, Tollywood, Vijayashanti-Mov

అయితే సినిమాల్లో నటించే హీరోయిన్స్ షూటింగ్ లొకేషన్లో నాకు అవి కావాలి ఇవి కావాలి అని గొంతెమ్మ కోరికలు కోరుతారు అనే అపవాదు ఉంటుంది.కేవలం హీరోయిన్స్ మాత్రమే కాదు హీరోలు మిగతా నటీనటులు కూడా వారికి ఏం కావాలన్నా కూడా ప్రొడ్యూసర్స్ తో చెప్పి తెప్పించుకుంటారు.అది ఇండస్ట్రీలో సర్వసాధారణంగా జరిగే విషయమే కానీ సాయి పల్లవి కూడా ఇలా తన కు లొకేషన్ లో ఏం కావాలో ముందే నిర్మాతకు చెబుతుందట.

ఇంతకీ ఆమెకు సెట్ లో ఇవ్వాల్సిన గొంతమ్మ కోరికలు ఏంటి అనుకుంటున్నారా ? అవి వింటే మీకు నవ్వొస్తుంది.కేవలం ఆమెకు రెండు నుంచి మూడు లీటర్ల కొబ్బరి నీళ్ళు ప్రతిరోజూ ఇవ్వాల్సిందేనట.

ఇవి కాకుండా మజ్జిగ మాత్రమే లీటర్ల కొద్ది తాగుతుందట.ఇలా కొబ్బరి నీళ్ళు, మజ్జిగ మాత్రమే నిర్మాతల నుంచి ఆమె ఎక్స్పెక్ట్ చేస్తుందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube