మళ్లీ తెలుగు సినిమాకు నో చెప్పిన సాయి పల్లవి

ఫిదా సినిమా( Fida movie ) తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ సాయి పల్లవి( Sai Pallavi ).ఆ సినిమా తర్వాత సాయి పల్లవి తెలుగు లో స్టార్‌ హీరోయిన్ అయింది.

 Sai Pallavi Once Again Reject A Telugu Film , Telugu Film, Sai Pallavi, Fida Mov-TeluguStop.com

అంతటి గుర్తింపు దక్కించుకున్న సాయి పల్లవికి ఓ రేంజ్ లో స్టార్‌ డమ్‌ వచ్చినా కూడా చాలా తక్కువ సినిమా లకు కమిట్ అయింది.ఇక సాయి పల్లవి గత ఏడాది లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మళ్లీ ఈ ఏడాది లో ఒక్క సినిమా తో కూడా రాలేదు.

సాయి పల్లవి సినిమా 2023 లో ఒక్కటి కూడా రాకపోవడం కు కారణం ఆమె కు ఆఫర్లు రాకపోవడం కాదు.ఆమె తన వద్దకు వచ్చిన చాలా ఆఫర్లను తిరష్కరించడం అనే విషయం తెల్సిందే.ఎట్టకేలకు మళ్లీ ఆమె సినిమా లకు కమిట్‌ అవుతోంది.తెలుగు లో నాగ చైతన్య హీరో గా కార్తికేయ 2 సినిమా దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం లో రూపొందుతున్న తండేల్‌ సినిమా( Tandel movie ) లో సాయి పల్లవి హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెల్సిందే.

సాయి పల్లవి మరో వైపు కన్నడ రాక్ స్టార్‌ యశ్ సినిమా లో కూడా నటించేందుకు ఓకే చెప్పిందని సమాచార అందుతోంది.మరో వైపు సాయి పల్లవి ఒక తమిళ సినిమా ని చేస్తోంది.

ఇంకా ఒక వెబ్‌ సిరీస్ ని కూడా చేస్తోంది.ఇన్ని సినిమా లు చేస్తున్న సాయి పల్లవి తాజాగా ఒక సినిమా కు నో చెప్పిందట.అది కూడా ఒక తెలుగు సినిమా కు అంటూ వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ టాలీవుడ్‌ యంగ్‌ హీరో తో కొత్త దర్శకుడు సినిమా ను ప్లాన్ చేశాడు.

నిర్మాత పలు దఫాలుగా హీరోయిన్‌ సాయి పల్లవిని సంప్రదించినా కూడా నో చెప్పిందట.ప్రస్తుతం చేస్తున్న సినిమా ల్లో కొన్ని సినిమా లు అయినా కంప్లీట్‌ అవ్వాలని ఆమె భావిస్తుందట.

అందుకే నో చెప్పిందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube