టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి( Heroine Sai Pallavi ) మనీని అసలు లెక్కచేయదు.ఈ ముద్దుగుమ్మ నచ్చకపోతే రూ.
కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తానన్నా ఈజీగా వదులుకుంటుంది.ఒక రోల్ నచ్చితే ఎంత తక్కువ డబ్బులు ఇచ్చినా ఆ సినిమా చేస్తుంది.
సాధారణంగా టాలీవుడ్ హీరోయిన్లు ఎక్కువ మనీ వస్తున్నాయంటే గ్లామర్ షో చేయడానికి కూడా వెనకాడరు.కానీ సాయి పల్లవి వారందరికీ విభిన్నం.ఇలా ఉండటానికి తన తల్లిదండ్రులే కారణమని సాయి పల్లవి చెబుతోంది. సాయి పల్లవి తల్లిదండ్రులు( Sai Pallavi Parents ) డబ్బులు ఒక ఫ్యాక్టర్ గా ఎప్పుడూ చూడలేదట.
నీకైదైనా కావాలా, నీకు అది అవసరమా లేదా, అవసరం అంటే కొనేద్దామని లేకపోతే వద్దు అని తల్లిదండ్రులు ఆమెకు చెప్పే వారట.డబ్బు ఉన్నాయా? మన దగ్గర లేవా? అనే దాంతో సంబంధం లేకుండా ఆలోచించేలా తనని పేరెంట్స్ పెంచినట్లు ఆమె తెలిపింది.

డబ్బు( Money ) మన నిర్ణయాలను ఎప్పుడూ ఇన్‌ఫ్లూయెన్స్ చేయకూడదని తన తల్లిదండ్రులు నేర్పించిన మంచి గుణం తనకి వచ్చినట్లు సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.అలాగే తల్లిదండ్రుల నుంచి డబ్బులు అడుక్కొని కొనుక్కోవడం బాగా అలవాటైందని వెల్లడించింది.హీరోయిన్ అయ్యాక కూడా ఇప్పటికీ తన తల్లిని అడిగే ప్రతిదీ ఖర్చు పెడతానని చెప్పింది.ఆఖరికి స్విగ్గీలో ఆర్డర్( Swiggy Order ) చేసినా డబ్బులు చెల్లించేందుకు తన మమ్మీనే ఓటీపీ అడగాలని పేర్కొంది.
ఏది కొనాలన్నా తన తల్లిని అడిగి కొనుగోలు చేస్తానని, వారి ముందు ఇప్పటికీ చిన్న పిల్ల లాగా ఫీల్ అవుతానని ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్ చెప్పుకొచ్చింది.

అయితే ఇప్పటికీ ప్రతిదీ వారిని అడగటం వారికి భారంగా ఉంటుందేమోనని భయం వేస్తుందని ఈ ముద్దుగుమ్మ అన్నది.అయితే ఒక్కోసారి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అని కూడా తన తల్లి ఆరా తీస్తుందని, అప్పుడు ఇతరుల కోసం డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చిందమ్మా అని చెప్తానని తెలిపింది.ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్( Social Media ) అవుతున్నాయి.
సాయి పల్లవి మనీని అవసరాలు తీర్చుకునే దాని లాగానే చూస్తుంది కానీ దానిపైన పెద్దగా వ్యామోహం లేదని తెలిసి చాలామంది ఫిదా అవుతున్నారు.ఇలా థింక్ చేసే వారు చాలా తక్కువ అని కామెంట్ చేస్తున్నారు.
