ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా ప్రాజెక్ట్ కె.ఈ సినిమా ని అశ్వనిదత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.
దాదాపు సినిమాని 500 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.అయితే ఈ సినిమా కథ టైం ట్రావెల్ స్టోరీ అన్న టాక్ బయట ఉంది.
కానీ సినిమా గురించి మాట్లాడిన రైటర్ సాయి మాధవ్ బుర్ర మాత్రం ప్రాజెక్ట్ K టైం ట్రావెల్ కథ కాదని క్లారిటీ ఇచ్చారు.అది టైం ట్రావెల్ కథ కాదు కానీ కొత్తగా ఉంటుందని తప్పకుండా ఆడియన్స్ కి మంచి అనుభూతిని అందిస్తుందని అన్నారు.
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మాటల రచయీ సాయి మాధవ్ బుర్ర ఎక్కువగా బాలకృష్ణ సినిమాలకు మాటలు రాస్తూ ఉంటారు.వీర సింహా రెడ్డి సినిమాకు కూడా సాయి మాధవ్ మాటలు రాశారు.
ప్రాజెక్ట్ కె విషయంలో ఈ రైటర్ చేసిన కామెంట్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కి మంచి హుశారు తెప్పించింది.ప్రాజెక్ట్ కె సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనె నటిస్తున్న విషయం తెలిసిందే.
సినిమాలో మరో అందాల భామ దిశా పటాని కూడా ఉంది.







